Devotional: ఈ ఆహారాలు తింటే చాలు.. అదృష్టం మీ వెంటే?

Devotional: సాధారణంగా ప్రతి ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలను అనుభవించాల్సిందే. మరి ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడడం సంపాదించిన డబ్బులు సరిపోక కష్టాలు ఎదురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆహారం మన ఆకలిని తీర్చడంతో పాటుగా మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందట. ఆహారం అదృష్టాన్ని తెచ్చి పెట్టడం ఏంటా అని అనుకుంటున్నారా, మీరు విన్నది నిజమే.

కొన్ని రకాల ఆహార పదార్థాలు కష్టకాలంలో తినడం వల్ల అదృష్టం వెంటాడుతుంది. మరి ఆహార పదార్థాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. పసుపు.. పసుపును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగించడంతోపాటు వంటల్లో కూడా పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వంటల్లో పసుపును ఉపయోగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. జీవితంలో సంపదను స్వాగతించడానికి ఆహారంలో పసుపును కలుపుకుని తినడం మంచిది. పచ్చ యాలకులు.. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. యాలకులను తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

 

దీనికి మనసును శాంతపరిచే, గందరగోళాన్ని తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. మీకు ఆలోచన పట్ల స్పష్టతను ఇస్తుంది. భారమైన భావాలను మనసు నుంచి తొలగిస్తుంది. వారి జీవితంలో కెరీర్ వృద్ధి అవకాశాలను ఆహ్వానించడానికి ఈ మసాలాను తినాలి. అలాగే ఎప్పుడైనా పరీక్షలు రాయడానికి వెళ్తున్న ముందు వ్యాపారం ప్రారంభించడానికి ముందు ఏదైనా ప్రయాణం చేసే ముందు కాస్త పెరుగులో చక్కెర కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వెళ్లిన పని కూడా విజయవంతం అవుతుంది. ఇది మానసిక కల్లోలాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, పెరుగు ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్యాక్టీరియాను పొట్టలో పెంచుతుంది.

 

కష్ట సమయాల్లో పెరుగు, పంచదార కలిపి తింటే మీకు అంతా మంచే జరిగే అవకాశం ఉంది. అరటిపండు.. ఇందులో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.. జ్యోతిషశాస్త్రం ప్రకారం అరటిపండు మీ జీవితానికి ఆనందాన్ని తెస్తుంది. ఎవరైనా కుటుంబకలహాల బారిన పడితే అరటి పండ్లు రోజూ తినాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. నల్ల మిరియాలు..
మిరియాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం నల్ల మిరియాలు దిష్టి తగలకుండా కాపాడతాయి. ఇవి శనిగ్రహంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -