Naga Chaitanya-Samantha: చైతన్య, సామ్ లకు ఇంతకు మించిన ఘోరమైన అవమానం ఉంటుందా?

Naga Chaitanya-Samantha: టాలీవుడ్ లో ఒకప్పుడు క్యూట్ జంట అంటే టక్కున గుర్తుకు వచ్చేంది నాగ చైతన్య, సమంత. ఈ జంటకు మాములుగా క్రేజ్ అండేది కాదు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ బంధం విడిపోయింది. అయితే ఇప్పుడు ఎందుకు ఇది మ్యాటర్ అంటారా, తాజాగా విడుదలైన బిచ్చగాడు సినిమాకు ఈ ఇద్దరకి స్టార్లకు సంబంధం ఉంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య, సమంతలకు భారీగా క్రేజ్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగ చైతన్యకు ఎంత మంది ఫ్యాన్సు ఉన్నారో అదే స్థాయిలో సామ్ కూడా ఉన్నారు. చైతన్య, సమంత కలిసి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 

అయితే తాజాగా ఈ ఇద్దరి భారీ ప్రాజెక్టు సినిమాలు విడుదల అయ్యాయి. కేవలం కొద్ది రోజుల గ్యాప్ లోనే చైతన్య, సమంత మూవీలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే సమంత నటించిన శాకుంతలం, చైతన్య నటించిన కస్టడీ సినిమాలు అట్టర్ ప్లాప్ గా ముగిసాయి. ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధించి దారుణంగా ఉన్నాయి.

 

అయితే ఈ రెండు సినిమాల కంటే బిచ్చగాడు2 సినిమా ఫస్ట్ డే బెటర్ కలెక్షన్లను సాధించింది.సెకండ్ డే కూడా బిచ్చగాడు2 బెటర్ కలెక్షన్లను సాధించిందని తెలుస్తోంది. తెలుగులో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న చైసామ్ కంటే విజయ్ ఆంటోని సినిమా భారీగా కలెక్షన్లను సాధించడం అంటే వాళ్లకు అవమానమే అని చెప్పాలి.

 

చైసామ్ లకు ఇంతకు మించి అవమానం ఉంటుందా అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. చైసామ్ సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకుంటుండగా కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్లే వాళ్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా అక్కినేని హీరోలకు అస్సలు 2023 అచ్చు రాలేదని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -