Ram Charan: చరణ్ వేసిన ఈ చురకలు కుల జాగిలాలకు గట్టిగా తగిలాయా?

Ram Charan: మనిషి జీవం పుట్టినప్పుడు కులం, మతం లేదు. ఆ తర్వాత వీటిని పుట్టించారు. ఇప్పుడు కాలం మారుతోంది. కానీ ఈ కులాలు మాత్రం పోవటం లేదు. పైగా వీటిపైనే గొడవలు, ఆదిపత్యాలు నడుస్తున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేదు, అందరినీ సోషల్ మీడియా వేదికగా కులాలతో విభజించి పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి విద్వేశాలు రెచ్చిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా తప్పు సమాచారాన్ని స్పెర్డ్ చేస్తూ అసమానతలు సృష్టిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫ్యాన్ గురించి అయితే చెప్పనసవరం లేదు. కొందరు గుడ్డి ఫ్యాన్స్ ఉంటారు. వీరికి విచక్షణా జ్ఞానం, విషయ పరిజ్ఞానం రెండు ఉండవు. నిలువెల్లా సినిమా పిచ్చి, కుల పిచ్చి నింపుకుని మహానీయులను కూడా కించపరుస్తారు.

 

కొన్ని రోజుల క్రితం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇంతే నిలువెల్లా కులద్వేషం తో వీరు రాసే పిచ్చి రాతలు, అసలీల మొర్ఫింగ్లు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంటాయి. అయితే ఇలాంటి కుల జాగిలాలకు స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రామ్ చరణ్ మాటలతోనే గడ్డి పెట్టాడు. వయసు చిన్నదే అయినా పెద్దయన గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పిన విధానం, ఉదహరించిన తీరు ఆకట్టుకున్నాయి.

 

దక్షిణాది సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన పేరు తలచుకోని మూవీ లవర్స్ ఉండరని, నిత్యం షూటింగ్ కు వెళ్లిన సమయంలో కచ్చితంగా గుర్తు చేసుకునే సందర్భం వస్తుందని వినయంగా చెప్పాడు రామ్ చరణ్. అంతే కాదు భారతీయ పరిశ్రమకు ఎంతో ధారపోసిన ఎన్టీఆర్ గురించి కొందరు అవగాహన రాహిత్యంతో మాట్లాడతారని వారికి నిజాలు తెలియకే ఇలా ప్రవర్తిస్తారని కౌంటరేశాడు.

 

జాతీయ స్థాయిలో టాలీవుడ్ సగర్వంగా నిలవడానికి కారణమే ఎన్టీఆరని స్పష్టం చేశాడు. చరణ్ వేసిన ఈ చురకలు కుల జాగిలాలకు గట్టిగా తగిలాయి. కళ్ళకు గంతలు కట్టుకుని మనసులో ఇతర ఉద్దేశాలతో ఎన్టీఆర్ ని నిందిస్తేనేనే గుర్తింపు వస్తుందనే భ్రమలో ఉన్నవాళ్లకు చరణ్ మాటలు చెంపపెట్టు లాంటివి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -