Ram Charan-Upasana: చరణ్ ఉపాసన విడిపోవాలని ఆ హీరోయిన్ కోరుకుందా?

Ram Charan-Upasana: టాలీవుడ్ క్యూట్ కపుల్ ఉపాసన, రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్దిరోజులుగా ఈ జంట పేరు సోషల్ మీడియాలో మారమగుతూనే ఉంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వినిపించనున్నారు ఈ దంపతులు. ప్రస్తుతం ఉపాసన ఏడు నెలల గర్భవతి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెళ్లి అయిన తరువాత దాదాపు పదేళ్లకు ఉపాసన తల్లి అవ్వడంతో ఒకవైపు మెగా కుటుంబ సభ్యులు అలాగే మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ లో మెగా ఇంటికి వారసుడినో వారసురాలినో ఇవ్వబోతోంది. అయితే మామూలుగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. కానీ సెలబ్రిటీల మధ్య కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలు విడాకులకు కూడా దారితీస్తూ ఉంటాయి. అలా రామ్ చరణ్ ఉపాసనల మధ్య కూడా చిన్న గొడవ జరిగిందట. అదేంటంటే రామ్ చరణ్ ఒక హీరోయిన్ తో అతిగా రొమాన్స్ చేయడం ఉపాసనకి అస్సలు నచ్చలేదట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్. కాగా కాజల్ తో కలిసి రామ్ చరణ్ మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాల్లో నటించింది. కాగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన భర్త ఓ హీరోయిన్ తో కలిసి అతిగా రొమాన్స్ చేయడం తనకి నచ్చలేదని తెలిపింది.

 

గోవిందుడు అందరివాడేలే సినిమాలో కాజల్ తో రామ్ చరణ్ కి ఎన్నో ఘాటు ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. అయితే ఇందులో అవసరం లేకపోయినా అతిగా రొమాన్స్ పెట్టారని గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఉపాసన చెప్పింది.
అంతేకాదు ఈ విషయంలో రామ్ చరణ్ కి తనకి గొడవలు కూడా వచ్చాయని, ఆ గొడవలు తారాస్థాయికి కూడా చేరుకున్నాయని,కానీ ఇంట్లో వాళ్ళు కల్పించుకొని మాకు సర్ది చెప్పారు అంటూ ఉపాసన ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -