Betel Leaf: తమలపాకుపై దీపం పెడితే కలిగే లాభం ఏమిటి.. ఖచ్చితంగా తెలుసుకోండి!

Betel Leaf: సాధారణంగా పూజ చేసేటప్పుడు దేవుడి ముందు మట్టి ప్రమిదలలో లేదా ఇత్తడి వాటిలో దీపంను వెలిగిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఆలయాలకు వెళ్లినప్పుడు కానీ లేదంటే ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ తమలపాకు పై దీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే తమలపాకు పై దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఫలితాలు కలుగుతాయి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆ విషయం గురించి పెద్దగా తెలియక పోయినప్పటికీ ఇతరులను చూసి వాటిని అనుసరిస్తూ అదే విధంగా చేస్తూ ఉంటారు. అయితే మరి తమలపాకుపై దీపం ఎందుకు వెలిగిస్తారు? అలా దీపం వెలిగించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయాల ప్రకారం తమలపాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక శుభకార్యానికి హిందువులు మొదటి తాంబూలం పెడుతూ ఉంటారు. అదేవిధంగా ముత్తైదువుకి ఇచ్చినప్పుడు కూడా తాంబూలం ఇస్తూ ఉంటారు. అయితే తమలపాకు కాడలో పార్వతి దేవి, మధ్యలో సరస్వతి దేవి, చివరన లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని హిందువులు భావిస్తూ ఉంటారు. అలా ఆ ముగ్గురి అమ్మవారి ఆశీస్సులు మనపై ఉంటాయి అని తమలపాకు పై దీపం వెలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా తమలపాకు పై దీపం వెలిగించడం వల్ల మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు. అయితే తమలపాకు పై దీపం వెలిగించేటప్పుడు కొన్ని రకాల నియమాలు కూడా పాటించాలి.
తమలపాకు పై దీపాన్ని వెలిగించేటప్పుడు తమలపాకులను దేవుడి వైపు ఉంచాలి. ఆ తర్వాత ప్రమిదలోకి తమలపాకు కాడ తుంచి వేయాలి. అనంతరం నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇలా ప్రతిరోజు ఉదయం ఈ విధంగా తమలపాకు పై దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -