Actress Meena: ఆ హీరోను మీనా తల్లి ఇంత ఘోరంగా అవమానించారా?

Actress Meena: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా అనంతరం హీరోయిన్గా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఇలా నటిగా ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నటువంటి మీనా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి మీనా తల్లి ఒకానొక సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజిత్ ను అందరి ముందు ఘోరంగా అవమానించారని తెలుస్తుంది. మీనా తల్లి ఇలా అజిత్ ను అవమానించాల్సిన అవసరం ఏంటి అనే విషయానికి వస్తే… గతంలో మీనా అజిత్ హీరో హీరోయిన్లుగా ఆనంద పూంకట్రు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

 

ఈ మూవీ అప్పట్లో మంచి విజయం సాధించడంతో అజిత్ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ వేదికపై అజిత్ కు మీనా అవార్డు ఇచ్చింది. ఇక ఆ శుభ సందర్భంలో.. అజిత్, మీనా కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేయాలంటూ హోస్ట్ కోరాడు.ఇలా వీరిద్దరిని కలిసి డాన్స్ చేయమని చెప్పడంతో వెంటనే మీనా తల్లి వేదికపై నుంచి మీనా చేయి పట్టుకుని కిందకు తీసుకువచ్చారు.

 

ఇలా అందరూ చూస్తుండగానే తన కుమార్తె అజిత్ తో డాన్స్ చేయడం ఇష్టం లేదన్న ఉద్దేశంతోనే మీనా తల్లి తన చేయి పట్టుకొని అక్కడి నుంచి కిందికి తీసుకువస్తూ స్టార్ హీరో అజిత్ ను దారుణంగా అవమానించారని తెలుస్తోంది.ఇలా మీనా తల్లి వ్యవహరించిన తీరును అప్పట్లో చాలామంది తప్పుపట్టి తనపై విమర్శలు కూడా చేశారు. ఏది ఏమైనా అందరూ చూస్తుండగా మీనా తల్లి అలా చేయడం పట్ల అజిత్ పరువు పోయినంత పని అయిందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -