War 2: ఆ స్టార్ హీరో వార్2 మూవీని మిస్ చేసుకుని ఎంతో బాధ పడుతున్నాడా?

War 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ తెలుగు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2లోనటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా యుద్దభూమిలో నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.

 

ఈ విధంగా హృతిక్ రోషన్ యుద్ధ భూమిలో ఎదురు చూస్తుంటాను అంటూ కామెంట్ చేయడంతో వార్ 2 లో ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ హృతిక్ రోషన్ ఈ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పేశారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించబోతున్నారని తెలిసే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కన్నా ముందుగా ఈ సినిమాలో నటించే అవకాశం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి వచ్చిందని తెలుస్తోంది.

 

ఇక ఈ సినిమా గురించి ప్రభాస్ కి చెప్పగా ఈ పాత్ర కాస్త నెగిటివ్ గా ఉండటంతో ఇలాంటి నెగిటివ్ పాత్రలలో తాను నటించనని ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమాను ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో ఈ పాత్రకు కరెక్ట్ గా ఎన్టీఆర్ అయితే సరిపోతారని భావించిన మేకర్స్ ఈ అవకాశం ఎన్టీఆర్ కు కల్పించారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాని రిజెక్ట్ చేసినటువంటి ప్రభాస్ సినిమాని రిజెక్ట్ చేసినందుకుగాను ఎంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -