NTR-Prabhas: ఆ రెండు రీజన్ల వల్లే అయోధ్యకు ఎన్టీఆర్, ప్రభాస్ వెళ్లలేదా?

NTR-Prabhas: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం మొత్తం పండగ చేసుకుంది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుతీరిన తర్వాత రామ మందిరంతో పాటు సరయు నది తీరం దీపోత్సవ్ కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. గర్భగుడిలో బాల రాముడి ని చూసి భక్తితో పులకించిపోతున్నారు భక్తులు. అయోధ్య అంతా ఎటు చూసినా రామనామ సంకీర్తనలు ఆధ్యాత్మిక కోలాహాలమే కనిపిస్తుంది.

ఇలాంటి వేడుకకి కనులారా వీక్షించటానికి ఆహ్వానం అందుకున్నారు చాలామంది ప్రముఖులు. అయోధ్య నుంచి ఆహ్వానం రావటం తమ పూర్వజన్మ సుకృతం అని పొంగిపోయారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ కుటుంబం, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, అమితాబచ్చన్ ఇలా ఎందరో ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు అద్భుతమైన ఘట్టాన్ని కనులారా వీక్షించి ఆనంద తన్మయత్వాన్ని పొందారు.

అయితే అలాంటి అదృష్టం టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ కి ఎన్టీఆర్ కి అనివార్య కారణాల వలన అందుకోలేకపోయారు. ప్రభాస్ కి ఎన్టీఆర్ కి కూడా అయోధ్యకి రావాలని, ఈ అపూర్వ ఘట్టంలో పాలుపంచుకోవాలని ఆహ్వానం అందింది. అయినప్పటికీ ఇద్దరూ అయోధ్యకు చేరుకోలేకపోయారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ కారణాలవలెనే ఇటీవల జరిగిన సీనియర్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు రోజు వేడుకలలో కూడా కనిపించలేదు యంగ్ రెబల్ స్టార్.అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ సినిమా షూటింగ్లో ఉన్నాడు.

 

దేవరలో సైఫ్ అలీ ఖాన్ తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సిన కారణంగా నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని భావించిన తారక్ అయోధ్యకు వెళ్లలేదని టాక్ నడుస్తోంది. అనుకోకుండా సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా ఆసుపత్రిలో చేరటం ఈ సమాచారం కూడా ఆలస్యంగా తెలియటంతో చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కారణాల పట్ల అటు ప్రభాస్ గాని ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -