Actress Laya: దేవుడా.. హీరోయిన్ లయ ఏకంగా అన్ని కోట్ల ఆస్తికి వారసురాలా?

Actress Laya: ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ లయ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పాలి. నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చింది. ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించింది. చాలావరకు స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్లలో తాను ఒక్కరిగా నిలిచింది.

ఇక లయకు సంగీతం, డాన్స్ పట్ల మంచి అవగాహన ఉంది. మంచి హోదాలో ఉన్న సమయంలోనే డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని వివాహం చేసుకుంది. ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం లయ తన ఫ్యామిలీతో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో స్థిరపడింది. ఇక పెళ్లి తర్వాత లయ సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీని చూసుకుంటుంది.

 

ఇక సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియా అందరికీ టచ్ లో ఉంటుంది. ఎక్కువగా డాన్స్ వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తన వీడియోలకు ఎవరైనా కంప్లిమెంట్ ఇస్తే వెంటనే వాళ్లకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆమె అంతే అందంగా ఉంది. ఇక సినిమాలకు దూరంగా ఉంటూ తను ప్రస్తుతం ఐటీ లో జాబ్ చేస్తుంది. తన భర్తకు అక్కడ రెండు మూడు హాస్పిటల్స్ కూడా ఉన్నాయని గతంలో తెలిపింది.

 

ఇక కొన్ని బిజినెస్ లు కూడా ఉన్నాయని గతంలో తెలిపింది. ఇక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరికొన్ని విషయాలు కూడా పంచుకుంది. తను అంబానీ సిస్టర్ అంటూ, టాటా మనవరాలిని అంటూ.. తనకు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని.. ఇక ఓన్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాను అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఫ్లైట్ లో నుండి తన ఆస్తులు మొత్తం చూపిస్తున్నాను అంటూ సరదాగా కామెంట్ కూడా చేసింది. తమ కుటుంబానికి దేవుని దయ వల్ల ఆస్తులు బాగానే ఉన్నాయంటూ.. కానీ వేల కోట్లు ఆస్తులు మాత్రం లేవని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -