Priyanka Chopra: ఆ సినిమాపై ప్రియాంక చోప్రా కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Priyanka Chopra: సాధారణంగా ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరో హీరోయిన్లు దర్శకనిర్మాతలు కొన్ని డైలాగులను రిపీటెడ్ గా చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా కొన్ని సినిమాల విషయంలో లోలోపల అయిష్టంగానే ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఆ సినిమా అంటే పిచ్చి ప్రేమ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి విషయాలను చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే నిర్మొహమాటంగా బయట పెడుతూ ఉంటారు. తాజాగా అదే విషయాన్ని ధైర్యంగా ఒప్పుకుంది ప్రియాంక చోప్రా.

ఆమె అయిష్టంగానే సినిమాను చేసినప్పటికీ ఆ సినిమా పేరును బయటకు చెప్పడానికి మాత్రం అంతగా ఇష్టపడలేదు. ఆ సినిమా పేరు మాత్రం బయటకు చెప్పను. కానీ ఆ సినిమా అనుభవం మాత్రం పరమ చెత్త. అసహ్యమేసింది. సెట్స్ లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే నాకిచ్చే డైలాగ్స్ చెత్తగా ఉండేవి. అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అవి. ఒక ఆడ బొమ్మలా కూర్చునేదాన్ని, స్వతహాగా నేను ఆ టైపు కాదు. అందుకే ఆ సినిమా నాకు నచ్చదు అంటూ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. అనంతరం ఆమె మాట్లాడుతూ..

 

బర్గర్స్ కంటే పరాటాలు తినడమే తనకిష్టమని, తాను తరచుగా చెప్పే అబద్ధాన్ని కూడా బయటపెట్టింది. ఎవరైనా ఫోన్ చేస్తే.. వచ్చేస్తున్నా, దారిలోనే ఉన్నా అంటూ వెంటనే అబద్ధం చెప్పేస్తాను తను అలా అంటే నమ్మొద్దని కూడా తెలిపింది ప్రియాంక చోప్రా. అనంతరం రిపోర్టర్ మీరు తరచుగా తరచుగా అద్దం చూసుకుంటారా అని ప్రశ్నించగా.. ప్రియాంక ఎక్కడ ఏ చిన్న అద్దం కనిపించినా అందులో తన మొహం చూసుకోవడం తనకు చిన్నప్పట్నుంచి అలవాటని ఆమె తెలిపింది. చివరికి షాపింగ్ మాల్ లో చిన్న స్పూన్ కనిపించినా, అందులో తన ముఖం చూసుకుంటానని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -