YSRTP: వైఎస్సార్టీపీని పట్టించుకోని జనాలు.. షర్మిల ప్లాన్ ఇదేనా?

YSRTP: తెలంగాణలో కొంతకాలం కిందట వైఎస్ షర్మిల వైయస్సార్సీపీ పార్టీని పెట్టి తెగ హడావిడి చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా షర్మిల తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా కాంట్రవర్సీ లను ఎదుర్కొంటోంది. కాగా షర్మిల తెలంగాణలో ఉనికి చాటుకోవాలన్నా, రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా కాంగ్రెస్ లో విలీనం చేయటమే వైఎస్ షర్మిల ముందున్న ఆప్షన్ అనే ప్రచారాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అలాగే అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్యలో షర్మిల పార్టీ ఉనికి కూడా చాటుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలోనే ఏమిచేయాలనేది షర్మిలకు పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకనే పరిష్కారం కోసం కర్నాటక డిప్యుటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 15 రోజుల క్రితం భేటీ అయినపుడే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేయమని షర్మిలకు డీకే సూచించారట. మళ్ళీ తాజాగా సోమవారం జరిగిన భేటీలో కూడా ఇదే విషయాన్ని డీకే ఆమెకు నొక్కిచెప్పారట.

 

ఇద్దరి మధ్య 40 నిముషాలు జరిగిన భేటీలో పార్టీ నడపటంలో ఉన్న సమస్యలన్నింటినీ షర్మిలకు డీకే వివరించినట్తు తెలుస్తోంది. పార్టీని నడపటంలోప్రధానమైన ఆర్ధిక సమస్యపైనే ఎక్కువగా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. పైకి ఎన్ని ఆదర్శాలు వినిపించినా అల్టిమేట్ గా డబ్బులేనిదే ఏమీచేయలేమన్న సత్యాన్ని షర్మిలకు డీకే వివరించినట్లు సమాచారం. వెలుపలి నుండి ఎవరు కూడా ఎంతోకాలం సాయం చేయలేరన్న విషయం గుర్తించాలని షర్మిలకు హితబోధ చేశారట. అదే కాంగ్రెస్ లో విలీనమైపోతే ఆర్ధికంగానే కాకుండా నేతల సమస్య కూడా ఒక్కసారిగా తొలగిపోతుందని నచ్చచెప్పారట.
అందుకు షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -