Tirumala: తిరుమల కొండల్లో ఉన్న ఈ తీర్థం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tirumala: తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం గురించి తెలియని వారే లేరని చెప్పాలి. జీవితంలో ఒక్కసారి అయినా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని అంటుంటారు. అందుకే అక్కడికి రోజుకు ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో కేవలం స్వామి వారి దర్శనం ఒక్కటే కాకుండా ఇంకెన్నో తీర్థాల దర్శనాలు చేసుకోవాల్సిన ఉన్నాయని చెప్పాలి.

అందులో ఒకటి తిరుమల కొండల్లో శంఖం ఆకారంలో ఉన్న తీర్థం. అది చిన్న కుంట మాదిరిగా ఉండటమే కాకుండా అది శంఖం ఆకారంలో ఉంటుంది. అందుకే దానికి శంఖు తీర్థం అని పేరు వచ్చింది. ఇక చాలా మంది భక్తులు అక్కడి తీర్థం పక్కన నుంచే నడకదారిన ప్రయాణిస్తుంటారు కానీ అక్కడ ఉన్న శంఖం ఆకారంలో ఉన్న తీర్ధాన్ని అంతగా గమనించరు.

 

కానీ అక్కడున్న వారికి మాత్రం ఆ తీర్థం గురించి తెలుసు. ఇక ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. ఇది స్వామివారికి దక్షిణ భాగంలో ఉంటుంది. ఇక అక్కడ సంవత్సరం అంతా నీరు ఉంటూనే ఉంటుంది. ఒక వేళ నీరు ఎండిపోయిన కూడా మళ్లీ వస్తుంది అని అక్కడి భక్తులు చెబుతున్నారు. ఇక తెలిసిన భక్తులు అక్కడ చిన్న పటం దగ్గర పూజలు చేస్తూ ఉంటారని తెలిసింది.

 

ఇక అందులో ఉన్న నీటిని ఒకప్పుడు భక్తులు తీసుకొని తాగే వారిని.. ఇక ఇప్పుడు అక్కడ వైపు ఎవరు వెళ్లకపోవటంతో.. ఆ నీటిలో మొత్తం చెత్తచెదారం లాంటివి ఏర్పడ్డాయని తెలిసింది. ఇక ఎవరైనా తిరుమలకు వెళ్లే వాళ్ళు కచ్చితంగా ఈ శంఖు తీర్థాన్ని దర్శించడానికి ప్రయత్నించండి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -