Deepam: దీపం వెలిగించడం వల్ల ఇన్ని లాభాలా.. ఏ దీపం బెస్ట్ అంటే?

Deepam: హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ కార్యక్రమాలు చేసే సమయంలో తప్పనిసరిగా దీపారాధన చేసి ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటాము. ఇలా దీపం వెలిగించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే దీపారాధనలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి అయితే ఏ దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం…

కామాక్షి దీపం: ఒక ప్లేటులో ఆరు తమలపాకులను పెట్టి మధ్యలో ఒక తమలపాకుపై కామాక్షి దీపం పెట్టాలి. ఇందులో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా తయారు చేసి దీపం వెలిగించాలి. ఈ దీపం పెట్టేముందు ఐదు తమలపాకులపై ఐదు దీపాలు పెట్టి వెలిగించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.

 

కుబేర దీపం: శుక్రవారం కుబేర లక్ష్మి యంత్రం ముందుదీపాన్ని వెలిగించడం వల్ల కుబేర దీపం అంటారు ఈ దీపం వెలిగించడానికి ముందు ప్రమిదలుకు పసుపు కుంకుమలతో అలంకరించాలి అలాగే ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి పచ్చ వొత్తిని తయారు చేసుకుని వెలిగించాలి. కుబేరునికి ఆకుపచ్చ అంటే ఎంతో ఇష్టం కనుక ఇలా పూజించడం వల్ల కుబేరుడి అనుగ్రహం మనపై ఉంటుంది.

 

ఉప్పు దీపం: శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉప్పు దీపం వెలిగించడం ఎంతో మంచిది. పెద్ద పళ్లెంలో పెద్ద ప్రమిద తీసుకొని దానిని ఉప్పు పోయాలి. దానిపై చిన్న ప్రమిద తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి. దానిపైన మరొక ప్రమిద పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -