Adipurush: ఆదిపురుష్ మూవీ మేకర్స్ కు బుద్ధి లేదా.. రామాయణంను తప్పుగా చూపించారా?

Adipurush: ప్రతి ఒక్కరికి రామాయణం గురించి తెలిసే ఉంటుంది. గతంలో ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు విడుదలైన తెలిసిందే. రామాయణంలో సీతమ్మ జాడను వెతకడం కోసం వానరమూకను, సుగ్రీవుని అనుచరులను అన్ని దిక్కులకు పంపించారు. కానీ, హనుమంతుడి మీద రాముడికి అపారమైన నమ్మకం ఉంది. అందుకే సీతమ్మ ఆచూకీ తెలుసుకోగలడన్న ఆశతో ఒకవేళ ఆమె కనిపిస్తే రాముడి దూతనని తెలియజెప్పేందుకు తన అంగుళీయకాన్ని హనుమంతుడి చేతికి ఇచ్చారు.

సీతమ్మ నువ వెతుక్కుంటూ హనుమంతుడు లంకకు వెళ్ళిన తరువాత రాముడు క్షేమాన్ని తెలిపి ఆ ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చాడు. ఇక సీతమ్మ కూడా తన చూడామణిని తీసి హనుమంతుడి చేతికి ఇచ్చింది. దానిని హనుమంతుడు తీసుకెళ్లి రాముడు చేతికి ఇస్తాడు. ఇది మనకు రామాయణంలో జరిగిన కథ. కానీ పురుష్ సినిమాలో మాత్రం మనకు అందుకు విరుద్ధంగా చూపించారు. తన చేతికి రాముడి ఉంగరం అందించిన హనుమంతుడికి, సీతమ్మ చేతి గాజును తీసి ఇవ్వడం, హనుమంతుడు ఆ గాజును రాముడి చేతిలో పెట్టడం చాలా స్పష్టంగా ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు.

 

రాముడికి తన ఆనవాలుగా సీతమ్మ చేతిగాజు ఇచ్చినట్టుగా ఏ రామాయణంలో ఉంది? ఏ ఆధారాలతో చూడామణి బదులుగా చేతిగాజును ఈ సినిమాలో చూపించారో అర్థం కాదు. వాల్మీకి రామాయణంలో అంత స్పష్టంగా ఉండగా సీతమ్మ చూడామణిని హనుమ చేతికి ఇచ్చి పంపిందనేది లోకవిదితమైన సంగతి కాగా, ఆదిపురుష్ లో దానిని చేతిగాజుగా ఎందుకు చిత్రీకరించారో అస్సలు బోధపడని సంగతి.

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -