Ram-Ravana: రావణుడు చనిపోయే ముందు చెప్పిన ఈ మాటలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ram-Ravana: రామాయణం గురించి మనందరికీ తెలిసిందే. రామాయణం అన్న పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు రావణాసురుడు,రాముడు. రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కాగా రామాయణంలో రాముడు రావణుడిని వధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రావణుడు చనిపోయే ముందు రాముడు చెప్పాడట. మరి రావణుడు రాముడికి చెప్పిన మాటలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లంకాధిపతి అయినా రావణ బ్రహ్మ యుద్ధ భూమిలో మృత్యు శయ్య‌పై అవసాన దశలో శ్రీరాముడితో ఈ విధంగా మాట్లాడాడు.

రామా నీ కంటే నేను అన్నింట్లో కూడా గొప్పవాడినే. నాది బ్రాహ్మణ జాతి. నీది ఏమో క్షత్రియ జాతి. నీకంటే వయసులో కూడా నేను పెద్దవాడిని. నీ కుటుంబం కంటే నా కుటుంబం చాలా పెద్దది. నా వైభవం కూడా నీ వైభవం కంటే అధికమైనది. నీ అంతఃపురం స్వర్ణమైతే, నా లంకా నగరం అంతా కూడా స్వర్ణమయమే. బల పరాక్రమాల్లో కూడా నీ కంటే నేను శ్రేష్టుడిని. అయితే నీతో నేను చూసుకుంటే నీ కంటే అన్నింటిలో కూడా నేను ముందు ఉన్నాను. అయినా కూడా యుద్ధంలో నీ ముందు నేను ఓడిపోయాను. నీవే యుద్ధం గెలిచావు. దీనికి కారణం ఒకే ఒక్కటి. అదేమిటి అంటే నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. కానీ నా తమ్ముడు మాత్రం నా వద్ద లేడు.

 

నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆ కారణం చేతే నేను ఓడిపోయాను అని రావ‌ణుడు తాను చ‌నిపోయే ముందు రాముడితో చెబుతాడు. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే కలిసి ఉంటే దేనినైనా సులభంగా సాధించచ్చు. ఎంతటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవచ్చు. కలిసి ఉంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు. కనుక దేనినైనా అధిగమించవచ్చు. అనవసరంగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నలుగురితో ఉంటే దేనినైనా మనం దాటేయవచ్చు. ఓటమి కూడా ఎదురవ్వదు. గెలుపు మన సొంతమవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -