Brazil: 19 ఏళ్ళ యువతి కవలలకు ఇద్దరు తండ్రులు.. ఎక్కడో తెలుసా?

Brazil: అత్యంత అరుదైన ఘటన ఇది.. కవలలే గానీ తండ్రులు వేరు ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. అవును ఇదే నిజం.. సాధారణంగా కవలలు అంటే ఒకే పోలికతో ఉంటారు. వారిని గుర్తించడం చాలా కష్టం. ఇలా కవలల పిల్లలకు సంబంధించి బోలేడు ఆశ్చర్యకరమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. కవలలు అంటే వారికి తల్లితండ్రి ఒక్కరే ఉంటారు. కానీ.. ఇక్కడ మాత్రం ఇద్దరు. విషయానికి వస్తే.. ఓ 19 ఏళ్ల యువతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు వచ్చిన అనుమానంతో కొంపకొల్లేరయింది. పిల్లలకు డీఎన్‌ఏ పరీక్ష చేయించగా షాకింగ్‌ విషయం వెల్లడయ్యింది. కవలల డీఎన్‌ఏ వేర్వేరుగా ఉంది. ఇది ఎలా సాధ్యం అని డాక్టర్లు ఆశ్చర్యపోగా సదరు యువతి అసలు విషయం చెప్పింది. తాను ఒకే రోజు ఇద్దరు యువకులతో శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం డాక్టర్లు ఇద్దరు యువకులకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేయగా కవలల చిన్నారులతో సరిపోయాయట.

ఈ వింత సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఓ యువతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఎనిమిది నెలల వయసు వచ్చాక ఆమెకు పిల్లలకు తండ్రి ఎవరా అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే గర్భం దాల్చడానికి ముందు ఆ యువతి ఇద్దరు యువకులతో శారీరంగా కలిసింది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌లో ఒకరిని తన కవల పిల్లలకు తండ్రిగా భావించి అతడికి డీఎన్‌ఏ పరీక్ష చేయించింది. అయితే ఆశ్చర్యంగా ఒక్క చిన్నారి డీఎన్‌ఏతో మాత్రమే సరిపోయింది. ఈ రిజల్ట్‌ చూసి వైద్యులతో పాటు సదరు యువతి కూడా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. తాను అదే రోజు మరో యువకుడితో శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో రెండో యువకుడికి డీఎన్‌ఏ పరీక్ష చేయించగా.. మరో చిన్నారికి అతడే తండ్రిగా తెలిసింది. ఇది అత్యంత అరుదైన సంఘటన. 10 లక్షల కేసుల్లో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది వైద్యులు తెలిపారు.

ఇలాంటి పరిస్థితులను శాస్త్రీయంగా హెటరో పేరెంటల్‌ సూపర్‌ ఫెకండేషన్‌ (బహుళ పిండోత్పత్తి) అని పిలుస్తారు. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసినప్పుడు.. సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు.. పురుషుల వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుంది. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలు వేర్వేరు మావి(ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయి. మనుషుల్లో ఇది అత్యంత అరుదైన సంఘటనే కానీ.. జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమే అని వైద్యులు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -