Vijay Deverakonda: ఆ ఒక్క లక్షణమే విజయ్ దేవరకొండ జీవితాన్ని నాశనం చేసిందా?

Vijay Deverakonda: నువ్విలా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు విజయ్ దేవరకొండ. ఇలా నటుడిగా చిన్న చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ అనంతరం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరిచిన అవకాశాలు వచ్చాయి. అనంతరం వెంటనే మరో రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగినప్పటికీ సినిమా మాత్రం పూర్తిగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక విజయ్ దేవరకొండ దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలుగా ఒక్కసారైనా హిట్ కూడా అందుకోలేకపోతున్నారు.ఇలా ఎంతో ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈ హీరో సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏంటి అని ఆరా తీయగా ఈయన సినిమాలు సక్సెస్ కాకపోవడానికి మరే ఇతర కారణాలు లేవని విజయ్ దేవరకొండ అతి వల్లే ఆయన సినీ కెరీర్ నాశనమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధంగా ఈయన నోటి దురుసు కారణంగానే సినిమాలు ప్లాప్ అవుతున్నాయని దాంతో ఈయన కెరియర్ కూడా నాశనమైందంటూ పలువురు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈయన లైగర్ సినిమా తర్వాత హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -