Viral: విచిత్రమైన రూపంలో జన్మించిన నవ శిశువు.. ఆ తర్వాత?

Viral: సృష్టిలో కొన్ని కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే చిత్ర విచిత్రమైన ఆకారంతో జంతువులు మనుషులు జన్మిస్తూ ఉంటారు. ఇప్పటికే అలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం జంతువులు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మనుషులు కూడా ఇంత వింతగా జన్మిస్తూ ఉంటారు. తాజాగా కూడా బీహార్ లో ఒక తల్లి వింత శిశువుకు జన్మనిచ్చింది. బీహార్‌లోని సరన్ జిల్లాలో ఛప్రా నగరంలో ఒక హాస్పిటల్ లో ఒక మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది.

చప్రా పట్టణంలో శ్యామ్చక్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రియాదేవి అనే మహిళకు 4 చేతులు, 4 కాళ్ళు, రెండు గుండెలు ఉన్న వింత ఆకారంలో తలతో ఉన్న వింత ఆకారమైన బాలికకు జన్మనిచ్చింది. మహిళ పురిటి నొప్పితో ఇబ్బంది పడటంతో ఆసుపత్రి యాజమాన్యం ఆపరేషన్ చేసి బాలికను బయటకు తీశారు. శిశువును బయటకు తీసిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా ఆపరేషన్ చేసి బయటకు తీసిన తర్వాత నవజాత శిశువు సజీవంగానే ఉంది. కానీ ఆ తర్వాత దాదాపు 20 నిమిషాల బిడ్డ కన్నుమూసింది.

ఈ విషయం గురించి హాస్పిటల్ డైరెక్టర్ అనీల్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి కేసులు చాలా అరుదుగా చూస్తుంటాము. గర్భాశయం లోని ఒకే గుడ్డు నుంచి ఇద్దరు పిల్లలకు పుట్టిన సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వరులుగా మారాయి. ఆ ఫోటో మీద చూసిన నెటిజన్స్ ఏమేమి వింతలు జరుగుతాయో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -