Om Raut: ఓం రౌత్ ఒక్కసారి ఆ సినిమాలు చూడు.. రామాయణం అంటే తెలుస్తుంది!

Om Raut: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదని చెప్పాలి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ తప్ప ఎక్కడ రామాయణం ఉట్టిపడేలా సినిమా లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఈ సినిమా రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే రామాయణం,మహాభారతం వంటి సినిమాలను చేయాలి అంటే అందరి దర్శకులకు చేతకాదని కొందరు మాత్రమే ఇలాంటి సినిమాలను ఎంతో గొప్పగా తీయగలరు అని తాజాగా ఈ చిత్రం నిరూపించింది.రామాయణం ఆధారంగా ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎంతో మంది హీరోలు రాముడిగా నటించి మెప్పించారు.

ఇక ప్రభాస్ నటించిన ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శన అవుతున్న నేపథ్యంలో దివంగత లెజెండరీ దర్శకుడు బాపుగారు అందరికీ గుర్తుకు వస్తున్నారు. బాపు గారి దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు రామాయణం ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

 

బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం, అందాల రాముడు శ్రీరామరాజ్యం వంటి సినిమాలు ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అయితే ఆది పురుష్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా విడుదలైన తర్వాత రామాయణం అంటే ఎలా ఉండాలి ఆ సినిమాని ఎలా చేయాలో దర్శకుడు ఓం రౌత్ బాపు గారు చేసిన సినిమాలను చూసి నేర్చుకోవాలి అంటూ పలువురు ఈయనకు సూచనలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటించిన విమర్శలు పాలవుతున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -