Om Raut: ఓం రౌత్ చేసిన ఈ తప్పులను ఆ రాముడు సైతం క్షమించడు కదా!

Om Raut: ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదల అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆశగా సినిమాకు వెళ్లారు. కలెక్షన్లు కూడా బానే వచ్చాయి కానీ ఇది వాల్మీకి రాసిన రామాయణం కాదు, ఇందులో చాలా తప్పులు వున్నాయి. వీటిని ఆ రాముడు సైతం క్షమించడు కదా. తనకు నచ్చిన రీతిలో తీసిన ఓం రౌత్ ని ఈ తప్పులెలా చేశారాంటూ నీలాదీస్తున్నారు అభిమానులు.కొన్ని సీన్లు ప్రేక్షకులు జీర్నించుకోలేకపోతున్నారు అవేంటంటే..

1) సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లడం రాముడు, లక్ష్మణుడు చూడడు. కానీ ఈ సినిమాలో చూపించారు. రాముడు కళ్ళముందే సీతాదేవిని రావణుడు అపహరించాడు.

2) లక్ష్మణుడు ని శేషు అని పిలవడం.. లక్ష్మణుడికి బయట ఎన్ని పేర్లు ఉన్నా శేషు అనేది ఆ లిస్టులో లేదు.రాఘవుడు అని రాముడుని, సీతాదేవిని జానకి అని పిలుస్తారు కానీ లక్ష్మణుడిని ఎక్కడ శేషు అని పిలరు.

3) లంకను భూమిపైన ఉన్న స్వర్గంలా పిలుస్తారు. అశోకవనం కన్నా అందమైన వనం ఎక్కడా ఉండదు అంటారు. కానీ దాన్ని స్మశానం లా చూపించాడు ఓం రౌత్. అంతా బొగ్గు మధ్య ఉన్న భవనం లాగా చూపించారు.

4) రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లాడు. కానీ సీతాదేవి రావణుడిని ఎప్పుడు చూడలేదు.రావణుడు గడ్డి పోచతో సమానమని ఆ గడ్డి పోచ వైపే చూస్తూ మాట్లాడేది కానీ ఇందులో మాత్రం రావణుడు తో ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఉన్నాయి..

5) కుంభకర్ణుడికి ఆంజనేయుడికి మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉంటాది. ఇందులో కుంభకర్ణుడు కొట్టడం వల్ల ఆంజనేయుడు వెనక పడడం చూపిస్తారు. ఇది ఆంజనేయ భక్తులకు ఏమాత్రం నచ్చలేదు.

 

6) వాల్మీకి రామాయణం ప్రకారం లక్ష్మణుని సీతమ్మ సకించింది అందుకే లక్ష్మణుడు రాముడు దగ్గరికి వెళ్ళాడు. కానీ సినిమాలో ఇదేమీ చుపించనే లేదు.

 

7) రాముడు వస్త్రధారణ కూడా సవ్యంగా లేదు. అయోధ్యలో వచ్చే సీన్స్ లలో తెల్ల దుస్తులు వేసుకొని జీసస్ లాగా కనిపిస్తున్నారు అని ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.

8) హనుమంతుడితో ఊర మాస్ డైలాగులు చూపించడం చాలా వింతగా ఉన్నది. మీ బాబుది… ఉతికేస్తా… అని నాటు
డైలాగులు చెప్పడం ప్రజలకు నచ్చడం లేదు.

 

9)రావణుడు సర్పాలతో మసాజ్ చేయించుకునే సీన్ అయితే ఓం రౌత్ మితిమీరిన సృజనాత్మకతను తెలియజేస్తుంది.

 

10) సినిమా మొదట్లో ప్రత్యక్షమైన బ్రహ్మ అసలు బ్రహ్మ లాగే లేరు. మామూలు సాధువు లాగే ఉన్నారు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసింది అలాంటి సన్నివేశాలు కోసమా?

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -