Mega Family: మెగా కుటుంబానికి ఆ పాపే లక్కీ ఛార్మ్.. ఇంతకు మించి సాక్ష్యం కావాలా?

Mega Family: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఉపాసన, రామ్ చరణ్ ల పేర్లు కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ జంట తల్లిదండ్రులు కావడంతో వీరి పేర్లు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి. ఈ దంపతులకు అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు చెర్రీ.

 

ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఈమధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా జరిగింది. రామ్ చరణ్ కూతురు ప్రభావంతోనే మెగా కాంపౌండ్ లో ఈ శుభాలు జరిగాయని అభిప్రాయపడ్డారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ మాకు అన్నీ శుభాలే కనిపిస్తున్నాయి. ఆ ప్రభావం మాకు ముందు నుంచి చూపిస్తోంది. చరణ్ కెరీర్ పరంగా ఎదుగుతున్నాడు. మంచి విజయాలు సాధిస్తున్నాడు. ఈ మధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగింది. ఇలా అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయి. ఈ బిడ్డ ప్రభావం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను..

నేడు ఉదయం 1: 49 నిమిషాలకు చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత చరణ్, ఉపాసన ఇలా తల్లిదండ్రులుగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అవ్వాలని, మా చేతిలో ఒక బిడ్డను పెట్టాలని కోరుకుంటున్నాము. ఇన్నేళ్లకు నా కోరిక తీరింది. అందుకే ఇది మాకు చాలా అపురూపం అని రాసుకొచ్చారు మెగాస్టార్. అలాగే సోషల్ మీడియాలో ఉపాసన డెలివరీ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజమే అంటూ ధృవీకరించారు చిరు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని, అన్ని రకాలుగా కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ది బెస్ట్ టీమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మంగళవారం ఆడ బిడ్డ జన్మించడం, తమ కులదైవం ఆంజనేయస్వామి వరప్రసాదం అని పేర్కొన్నారు చిరంజీవి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -