Success: ఈ యువతి ఎలా సక్సెస్ అయ్యారో తెలిస్తే మాత్రం దండం పెట్టాల్సిందే!

Success: లక్ష్యం ఉంటే మన ఇబ్బందులు మన ఆర్థిక పరిస్థితులు ఏవి అడ్డంకి కాదని ఇప్పటికే ఎంతోమంది ఉన్నత కొలువులలో ఉన్నటువంటి వారు నిరూపించారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి వారు ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అలా స్ఫూర్తిగా నిలిచిన వారి కోవకే చెందుతారు తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన రమ్య.

 

రమ్య ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈమె ఐఏఎస్ కావడానికి ఎంతో కష్టపడ్డానని తన కష్టాలను తెలియజేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. పేదరికంలో పుట్టినటువంటి రమ్యను తన తల్లి ఎంతో కష్టపడి చదివించారు. ఈ విధంగా ఎంబీఏ పూర్తి చేసినటువంటి రమ్య కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఉద్యోగ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు.

ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తూనే ఈమె సివిల్స్ లక్ష్యాన్ని చేసుకున్నారు.ఈ విధంగా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువుపై దృష్టి పెట్టారు. ఇలా సివిల్స్ పై దృష్టి పెట్టినటువంటి రమ్య ఆరో ప్రయత్నంలో సివిల్ ర్యాంక్ సాధించారు. ఈ విధంగా ఈమె 2021 సివిల్స్ పరీక్షలలో ఈమె జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించి సంచలనాలను సృష్టించారు.

 

ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉన్నటువంటి రమ్య ప్రస్తుతం ఐఏఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈమె తనలా ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తూ మంచి విషయాలను తెలియజేస్తుంటారు.మనం మన ప్రయత్నంలో విఫలమవుతున్నాము అంటే దానిని ఆసరాగా చేసుకుని ముందడుగు వేయాలి కానీ అదే చివరి ప్రయత్నం అనుకొని ప్రయత్నాన్ని ఆపకూడదు అంటూ చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -