Ram Charan: మెగా ప్రిన్సెస్ ఎవరి పోలిక.. ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందిగా!

Ram Charan: మెగా కోడలు ఉపాసన ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలిసి అందరూ ఆనందం వ్యక్తం చేశారు.గత మూడు రోజులకు అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి ఉపాసన తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో నేడు మధ్యాహ్నం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇలా ఉపాసన డిశ్చార్జ్ కావడంతో మొదటిసారి రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఉపాసన 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. అభిమానుల ఆశీర్వాదం ప్రార్థనలు వల్ల తన కుమార్తె ఆరోగ్యంగా ఉందని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా బిడ్డ పై ఉండాలని రామ్ చరణ్ కోరారు. ఇక ఉపాసనకు డెలివరీ చేసినటువంటి అపోలో హాస్పిటల్ వైద్యులందరికీ ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.

సోషల్ మీడియా వేదికగా తమకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఇంత సంతోషకరమైన ఈ సమయంలో తాను ఎక్కువ మాట్లాడలేకపోతున్నానని రామ్ చరణ్ తెలిపారు. అయితే మీడియా ప్రతినిధులు రామ్ చరణ్ ను ప్రశ్నిస్తూ పాపకు ఏదైనా పేరు ఫిక్స్ అయ్యారా అని ప్రశ్నించడంతో ఉపాసన నేను పాపకు పేరు ఫిక్స్ అయ్యామని 21వ రోజు పాప పేరును రివీల్ చేస్తామని తెలిపారు.

 

ఇక మెగా ప్రిన్సెస్ ఎవరి పోలిక ఉంది అనే విషయం గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రాంచరణ్ మీడియా ప్రశ్నిస్తూ పాప ఎవరు పోలికలతో ఉంది అని అడగగా రాంచరణ్ నా కూతురు నా పోలికలతోనే ఉంది అంటూ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత రెండు రోజుల క్రితం ఇదే ప్రశ్న చిరంజీవి గారిని అడగడంతో ఇప్పుడే పుట్టింది కదాపోలికలు గుర్తించడం కష్టమని చెప్పారు కానీ రామ్ చరణ్ మాత్రం తన కూతురు తన పోలికలతోనే ఉందని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -