Youtuber: ఈ యూట్యూబర్ అద్బుతమైన సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Youtuber: కొవిడ్ అనంతరం వినూత్న ఆలోచనలు యువత ముందుకు వెళ్తున్నారు. ఉద్యోగం చేస్తే ఎంతకాలమైనా ఒకరి కిందనే పని చేయాలనే భావన రావటంతో, స్వయం ఉపాధి వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాని ప్లాట్ ఫాం గా ఎంచుకుంటున్నారు. యూట్యూబ్ క్రియేటర్లుగా మారి, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరికొందరైతే కోట్లుకు కూడా పాకారు. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కూడా అలాంటి వారే.

యువత తమ పద్ద ఉన్న ఐడియాస్ తో వీడియో చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఆదాయ అర్జనలో తమ మర్క్ ను చాటుకుంటున్నా రు. అలాంటి వారిలో నెంబర్ ఎవరో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎంటర్టైన్మెంట్ రంగంలో అత్యధిక నికర విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్ గా నిలిచాడ భువన్ బామ్.

 

బడ్డింగ్ ఆర్టిస్టుగా వినోద పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించిన భువన్, ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ప్రతిభనే ఆధారంగా చేసుకొని అంచెలంచెలుగా ఎదిగాడు. దేశంలోని టాప్ యూట్యూబర్లలో ఒకరిగా నిలిచాడు. 26 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భువన్ నికర విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.122 కోట్లు.

 

గుజరాత్ కు చెందిన భువన్ కు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఉన్న ప్రేమతో దాన్నే కెరియర్ గా ఎంచుకున్నాడు. ఢిల్లీలోని చిన్న కేఫ్లు, రెస్టారెంట్లలో పాడటం మొదలు పెట్టాడు. రియాలిటీ టీవీ షో పాటల పోటీల్లోనూ పాల్గొనేవాడు. ఈ క్రమంలో సంపాదన నెలకు రూ. 5000 మాత్రమే. ఆ తర్వాత ఏదైనా సాధించాలన్న కసితో ఈ స్థాయికి ఎదిగాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -