Donkey Milk Soap: ఆ రాష్ట్రాల్లో గాడిద పాలతో తయారు చేసిన సబ్బును వాడుతున్నారు .. కారణం అదే!

Donkey Milk Soap: ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం వివిధ రకాల చిట్కాలను పాటిస్తుంటారు. మన చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే గాడిద పాలతో తయారు చేసిన సబ్బు వాడాలట. గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టులు వెల్లడించారు. గాడిద పాలలో యాంటీ ఏజింగ్‌ గుణాలు ఎక్కువగా ఉండటంతో గాడిద పాలతో సబ్బులను తయారు చేసి అమ్ముతున్నారు. పైగా ఈ సబ్బులు వాడితో అందంతోపాటు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారని ఆ కంపెనీ చెబుతోంది.

పూర్వం ఈజిప్ట్‌ మహారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇలా గాడిద పాలను స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని చర్మ సంరక్షణ కలుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ గాడిద పాలతో తయారుచేసిన సబ్బులను అమ్ముతుంది. గాడిద పాలతో చర్మానికి వృద్ధాప్యం రాదని అంతేకాక చర్మం కాంతివంతంగా, సున్నితత్వంతో పాటు మృదువుగా మారుతుందని చెబుతున్నారు.

ఈ కారణంతో గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబర్చి కొనుక్కుంటున్నారు. అయితే గాడిద పాలలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉండిన కారణంగా ఇవి మొటిమలను తగ్గించి ఇన్ఫెక్షన్లు కాకుండా చేస్తాయని అంటున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో గాడిద పాల సబ్బులకు మంచి గిరాకీ ఉందట. ఈ ప్రాంతాల్లోని పలువురు సబ్బులను కాకుండా ఏకంగా గాడిదపాలని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లీటర్‌ గాడిద పాలు రూ. 1000 పెట్టి కొనుక్కొని తాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -