Lord Shiva: పరమశివుడిని ఈ విధంగా పూజిస్తే మంచి జరుగుతుందట.. ఏం చేయాలంటే?

Lord Shiva: త్రిమూర్తులలో ఒకరైనటువంటి బోలా శంకరుడు మహిమానీత్వాలు గురించి అందరికీ తెలిసిందే. మనసారా శివయ్యను పూజిస్తే తప్పకుండా మన బాధలను విని మనపై ఆయన అనుగ్రహం కురిపిస్తారని భావిస్తారు. అందుకే మనకు ఏ బాధలు ఉన్నా శివయ్య వద్ద ఆలపించుకుంటూ ఉండడం అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం మనపై ఉండాలి అంటే ప్రతి సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతారని భావిస్తారు.

ఇకపోతే సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ రోజున ఏ విధంగా పూజించాలి ఎలా పూజిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం మనపై ఉంటుందనే విషయానికి వస్తే..సోమవారం ఉదయమే నిద్ర లేచి అలాంటి స్నానం చేయాలి అలాగే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర చిత్రపటాన్ని శుభ్రం చేసి గంధంతో బొట్లు పెట్టాలి.

 

ఇలా శివపార్వతుల చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజ ప్రారంభించాలి అలాగే మన ఇంట్లో శివలింగం కనుక ఉంటే శివలింగానికి మంచి నీటితో అభిషేకాన్ని చేయాలి. తర్వాత విభూది సమర్పించి, ఆ విభూతిని నుదుటిని పెట్టుకోవాలి. అదేవిధంగా శివుడికి బిల్వపత్రి అంటే చాలా ఇష్టం.బిల్వాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. బిల్వపత్రాన్ని శివుడికి సమర్పిస్తే దారిద్రం తొలగిపోతుంది.

 

తెల్ల గన్నేరు, ఎర్ర గన్నేరు, తుమ్మి పూలు, మోదుగ పూలు, తెల్ల జిల్లేడు పూలు శివుడికి ఎంతో ఇష్టం. ఈ పుష్పాలతో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇక స్వామివారి అష్టోత్తర మంత్రాన్ని చదువుతూ సోమవారం ఉపవాసం ఉండి అనంతరం సాయంత్రం శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి.ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహం మనపై ఉండి మనకు ఉన్నటువంటి ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -