Shiva Puja: శివపూజ సమయంలో ఈ తప్పులు చేస్తే ఫలితం శూన్యం.. అల చేస్తే పాపం తగులుతుందా?

Shiva Puja: మామూలుగా హిందువులు శివుడిని సోమవారం రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శివుడిని ప్రత్యేకంగా అభిషేకాలు చేయడంతో పాటు స్వామి వారికి ఇష్టమైన వాటిని సమర్పించి భక్తిశ్రద్ధలతో వేడుకుంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన వాటిని సమర్పించి పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడు. మీరు శివ పూజ చేసినప్పుడు లేదంటే ఎక్కడికైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు బాగా గమనిస్తే శివుడికి కుంకుమ తిలకం అన్నది ఉండదు. అలాగే చాలామంది శివ పూజ చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు కూడా చేస్తూ ఉంటారు.

మరి శివుని పూజ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు శివుడిని పూజించేటప్పుడు, తులసి ఆకులని అసలు ఉపయోగించకూడదు. అలానే, శంఖం, కొబ్బరినీళ్లు, ఎర్రని రంగులో ఉండే పువ్వులు పెట్టకూడదు. వీటిని శివుడికి సమర్పించడం అంత మంచిది కాదు. వీటితో అస్సలు శివుడిని ఆరాధించకూడదు. శివుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తుల కోరికల్ని పరమేశ్వరుడు వెంటనే తీరుస్తాడు. కాగా మహాశివరాత్రి, శ్రావణమాసం అంటే శివుడికి చాలా ప్రీతికరం. ఆ రోజుల్లో పూజలు చేస్తే, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

 

అన్ని దేవుళ్ళని విగ్రహరూపంలో పూజిస్తూ ఉంటాం. కానీ, శివుడిని లింగ రూపంలో పూజిస్తాం. అన్ని దేవుళ్ళకి తిలకం పెట్టినట్లు శివుడికి పెట్టరు. శివుడిని పూజించేటప్పుడు, కుంకుమ, సింధూరం వంటివి పెట్టకూడదు. సింధూరం, కుంకుమ చాలా దేవుళ్ళకి ఎంతో ఇష్టం. అందుకని వాటిని పూజ సమయంలో వాడుతూ ఉంటాము..కానీ, శివుడికి అలా కాదు. శివుడికి శంఖంతో నీళ్లు ఇవ్వకూడదు. తులసి ఆకులని శివుడికి పెట్టకూడదు. కొబ్బరి నీళ్ళని కూడా శివుడికి సమర్పించకూడదు. అలానే, ఎర్రటి పూలతో కూడా పూజ చేయకూడదు. శివుడికి పసుపుతో కూడా పూజ చేయకూడదు. పసుపుతో కూడా శివుడిని పూజించడం మంచిది కాదు.

 

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -