Family: కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మాత్రం ఆ పనులు చేయకూడదా?

Family: సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఒక ఏడాది పాటు పూజలు చేయకూడదని చాలామంది భావిస్తుంటారు. ఇలా ఏడాది పాటు ఆ ఇంట్లో ఎలాంటి పూజలు కాని శుభకార్యాలు కానీ చేయకూడదని భావించి చాలామంది ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ఫోటోలను అలాగే దేవుడి సామాగ్రాలను కూడా ఏడాది పాటు ఎత్తి పెడతారు. నిజంగానే ఒక ఇంట్లో మరణం జరిగితే ఏడాది వరకు పూజలు చేయకూడదా.. పండితులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే…

ఇంట్లో మరణం సంబంధించిన తర్వాత ఏడాది పాటు పూజలు చేయకూడదు అనేది శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు.ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని ఆ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయని భావిస్తారు. ఇక దీపం లేనటువంటి ఇల్లు స్మశానంతో సమానమని పండితులు చెబుతున్నారు.

 

ఈ విధంగా ఏ ఇంట్లో అయితే దీపారాధన ఉండదో ఆ ఇంట్లో నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అలాంటి ఇంట్లో మరికొన్ని సమస్యలు కూడా వస్తుంటాయని పండితులు తెలియచేస్తున్నారు. అందుకే ఒక ఇంట్లో మరణం జరిగినా కూడా 11 రోజుల దినం పూర్తి అయిన వెంటనే ఇంటిని శుభ్రం చేసుకుని తిరిగి దీపారాధన చేయడం ఎంతో మంచిది శాస్త్రం కూడా ఇదే చెబుతుంది.11 రోజులపాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను చేయకూడదు 11వ రోజు దినం అయిన వెంటనే 12వ రోజు నుంచి యధావిధిగా పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చు.

 

ఇక ఇంట్లో పూజ చేయడమే కాకుండా గుడికి కూడా వెళ్ళవచ్చు కానీ ప్రత్యేకంగా హోమాలు, యాగాలు వంటివి చేయకూడదు అలాగే కొత్త వాహనాలు కొత్త ఇల్లు వంటివి కొనుగోలు చేయకూడదు. అలాగే శుభకార్యాలను కూడా చేయకూడదు కానీ నిత్యం దీపారాధన చేయవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -