Friday Deepam: శుక్ర‌వారం నాడు ఇలా ఉప్పు దీపం పెడితే దేవుని అనుగ్రహం ఉంటుందా?

Friday Deepam: శుక్రవారం రోజు లక్ష్మి దేవి పూజ చేయడం ఎంతో శుభప్రదం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు అలాంటి వారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం శుక్రవారం పూట ఉప్పు దీపం వెలిగించడం ఎంతో మంచిది అది ఎలా వెలిగించాలి వెలిగించడం వలన వచ్చిన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మనం నిత్యం దీపారాధన చేసే చిన్న ప్రమిదలు కాకుండా కొంచెం పెద్ద ప్రమిదలు ఉంటాయి.

అలాంటివి రెండు తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసిన తర్వాత నేల మీద చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఆ ముక్కు మీద ఈ రెండు ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టాలి. అప్పుడు పై ప్రమిదలో ఒక పావుకిలో రాళ్ల ఉప్పును వేయాలి.

 

రాళ్ల ఉప్పు ఎంతో దిష్టి తీయటంలోనూ దోషాలని తొలగించడంలోనూ ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి ఇలాంటి రాళ్ల ఉప్పుని పరిమితిలో వేసి ఉప్పు మీద పసుపు కుంకుమ చల్లాలి. తర్వాత దానిమీద చిన్న ప్రమిద పెట్టి ఆ ప్రమిదకి కూడా పసుపు కుంకుమ రాసి, అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులని ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించండి. తర్వాత పండ్లు కానీ పాలు కానీ పటిక బెల్లం కానీ నివేదనగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి.

 

ఆ తరువాత సంకల్పం చెప్పుకొని ఏ కష్టం నుంచి బయట పడాలని కోరుకుంటున్నారు కోరుకోవాలి. ఆ తర్వాత కనకధారా స్తోత్రాన్ని లలితా సహస్రనామాన్ని చదువుకోవటం వలన మంచి జరుగుతుంది. మరుసటి రోజు వచ్చే శనివారం నాడు ప్రమిదలో ఉన్న ఉప్పుని తీసి నీటిలో కలపాలి ఒకవేళ కనుక అలా కుదరకపోతే ఎవరు తప్పని ప్రదేశంలో వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం తో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -