KGF3: కేజీఎఫ్3 మూవీపై యశ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నాడంటే?

KGF3: కన్నడ హీరో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ భారీగా కలెక్షన్స్ ను సాధించాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ తర్వాత విడుదలైన కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను రాబట్టింది. అలా ఈ రెండు సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టించాయి.

హీరో యశ్ కి పాన్ ఇండియా స్టార్ అనే గుర్తింపును కూడా తెచ్చిపెట్టాయి. అందరి అంచనాల్ని అందుకొని, ఊహాలకు అందని విజయాన్ని సాధించింది కేజీఎఫ్-2. అయితే చాప్టర్ వన్ చాప్టర్ 2 సినిమాలు అయితే విడుదల అయ్యాయి కానీ, మరి కేజీఎఫ్ ఛాప్టర్-3 పరిస్థితేంటి? ఈ ప్రశ్న చాలా మంది అభిమానుల మదిలో మెదులుతోంది. కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం.. కేజీఎఫ్ ఛాప్టర్-3 కూడా ఉంటుందని కానీ ఇప్పట్లో రాదని తెలుస్తోంది. స్వయంగా యశ్ కాంపౌండ్ నుంచి ఈ మ్యాటర్ బయటకొచ్చింది. హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య ఛాప్టర్-3కి సంబంధించి చర్చ జరిగింది. ఒక లైన్ కు ఇద్దరూ సూచనప్రాయంగా అంగీకరించారు.

 

కానీ అది చాలదనేది యష్ ఫీలింగ్. ఎందుకంటే, కేజీఎఫ్-2 ఖండాంతరాలు దాటిపోయింది. పాన్ వరల్డ్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది. కాబట్టి ఈసారి వరల్డ్ ఆడియన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని లైన్ రాసుకోవాల్సి ఉంటుంది. అందుకే టైమ్ అవసరమనేది యష్ ఫీలింగ్. ఇటు ప్రశాంత్ నీల్ కూడా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అవి పూర్తయిన తర్వాత ఛాప్టర్-3 మీద కూర్చునే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో జపాన్ ను సందర్శించాలనుకుంటున్నాడు యష్. కేజీఎఫ్ ఛాప్టర్-2తో అతడికి జపాన్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -