Bhola: ఆచార్యను మించిన డిజాస్టర్ భోళా.. ఈ సినిమా నష్టాలు మరీ ఈ స్థాయిలో ఉన్నాయా?

Bhola: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాచగా నటించిన చిత్రం భోళా శంకర్. అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదని తెలుస్తుంది. ఈ విధంగా భోళా శంకర్ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని డిజాస్టర్ మూట కట్టుకుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ద్వారా నిర్మాత అనిల్ సుంకరకు భారీ ఎఫెక్ట్ పడింది.

అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా తర్వాత అనిల్ సుంకరకు ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆచార్య సినిమాను మించి డిజాస్టర్ సినిమా అంటూ నేటిజన్ల నుంచి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆచార్య సినిమా స్ట్రైట్ సినిమా ఇందులో రామ్ చరణ్ కూడా నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.

 

ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు కథ కథనం ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంది కానీ భోళా శంకర్ సినిమా మాత్రం తమిళ రీమేక్ చిత్రం అనే విషయం మనకు తెలిసిందే. హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు ఈ సినిమా రీమేక్ సినిమా.భోళా శంకర్ సినిమాలో మాత్రం ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో ముందే ఊహించవచ్చు.

 

సినిమాకు 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలలో నష్టాలు ఉండనున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు సైతం అమ్ముడవలేదని తెలుస్తోంది.ఏది ఏమైనా పదేళ్ల తర్వాత చిరంజీవి సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ మెహర్ రమేష్ కి ఈ సినిమా ద్వారా మరోసారి నిరాశ తప్ప లేదని చెప్పాలి. మరి ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకునే సమయానికి ఎంత మేర కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -