Bhola Shankar: మెగా ఫ్యాన్స్ వల్లే భోళా శంకర్ అట్టర్ ఫ్లాప్.. ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

Bhola Shankar: సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. ఒక సినిమా సరిగ్గా ఆడితే పూనకాళ్లు వచ్చి ఊగిపోతాము. అదే సినిమా కొంచెం తేడా కొట్టిన సరే ఆగ్రహంతో రగిలిపోతాము. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా సినిమా నచ్చితే బాగుంది అని ఆదరిస్తాము. అది ఏ ఇండస్ట్రీదైన సరే బేధాలు చూపకుండా సినిమాని ఆడిస్తాము. అయితే రీసెంట్ గా విడుదలైన భోళా శంకర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం బాస్ అభిమానులే అని బేబీ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్ అన్నారు. ప్రతి ఒక్కరూ 40 ఏళ్ల వయసులోనే సినిమాలు ఆపేస్తున్న కూడా దరిదాపు 70 ఏళ్ల వయసు వచ్చినా సరే చాలా స్టైలిష్ గా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.ఈ వయసులో కూడా ఎప్పటికప్పుడు మంచి సినిమాలు తీయడం కోసం ప్రయత్నిస్తున్నారు. భోళా శంకర్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు.

 

కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మాత్రం బాస్ అభిమానులే కారణం. సినిమా లో ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వల్ బాలేదు అని నోటి ప్రచారం వల్లే సినిమా ఆడలేదు. నేను కూడా బాస్ అభిమానినే. ఒక తోటి బాస్ అభిమానిగా ఆయన మీద నమ్మకంతో ఆయన ఫ్యాన్స్ మీద నమ్మకంతోనే బేబీ సినిమాను తీసి హిట్ కొట్టాను. బేబీ సినిమా హిట్ అవ్వడానికి కారణం బాస్ అభిమానులే అలాంటి ఆయనకు ఏది మంచో ఏది చెడో తెలియదా?

 

హిట్లర్ సినిమాతోనే ఆయన కెరీర్ అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. మొన్న మొన్న ఖైదీ నెంబర్ 150 ముందు ఆయన కెరీర్ ముగిసింది అని భ్రమపడ్డారు కానీ ఇప్పటికీ వచ్చి హిట్లు కొడుతున్నారు. ఇలాగే ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. అలాగే మళ్లీ కొత్త సినిమాతో వస్తారు. బ్లాక్ బస్టర్ కొడతారు అని ఎమోషనల్ అవుతూ పేర్కొన్నారు ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -