Keerthy Suresh: కీర్తి సురేష్ చెల్లి రోల్ లో నటిస్తే మూవీ బకెట్ తన్నేసినట్టే.. ఇదే సాక్ష్యమంటూ?

Keerthy Suresh: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదట నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆ తరువాత తెలుగులో నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారు వారి పాట వంటి సినిమాలలో నటించి మెప్పించింది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ చవి చూసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉండగా అందులో కీర్తి సురేష్ కూడా ఒక కారణమంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అదేమిటంటే కీర్తి సురేష్ ఇందులో చిరంజీవి చెల్లెలిగా నటించడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల రజనీకాంత్ నటించిన అన్నాత్తే సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలిగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.

 

దీంతో కీర్తి సురేష్ చెల్లెలుగా నటించింది అంటే ఆ సినిమా ఫ్లాప్ అవడం ఖాయం అంటూ వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. భోళా శంకర్ సినిమాకు ముందే ఈ విషయాన్ని కొందరు నెటిజెన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు మరోసారి ఇదే వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తే ఆ సినిమా బకెట్ తన్నేసినట్టే ఫ్లాప్ అయినట్టే అంటూ కామెంట్ చేస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -