Bhola Shankar: భోళా శంకర్ మూవీని ఆ డైరెక్టర్ తీసి ఉంటే మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేదా?

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన తదుపరి చిత్రం భోళా శంకర్. వాల్తేరు వీరయ్య వంటి సెన్సేషనల్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

తమిళ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ఎదుర్కొంది. డైరెక్టర్ మెహర్ రమేష్ మొదటి నుంచి కూడా చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఒక మీడియం రేంజ్ హీరోలు కూడా ఈయన దర్శకత్వంలో సినిమా చేయాలి అంటే వెనకడుగు వేస్తారు అలాంటి ఒక హీరోకి చిరంజీవి అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని తెలుస్తుంది.

ఇలాంటి ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి చిరంజీవి అవకాశం ఇవ్వడానికి కారణం లేకపోలేదు మెహర్ రమేష్ చిరంజీవికి దగ్గర బంధువు కావడంతోనే బందు ప్రీతి వల్ల ఈయనకు సినిమా అవకాశం ఇచ్చారు అయితే ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది ఇకపోతే ఈ సినిమాకు ముందుగా అనుకున్న డైరెక్టర్ మెహర్ రమేష్ కాదని సమాచారం. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం చేయాల్సి ఉండేదట.

సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ జి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన మెగాస్టార్ చిరంజీవిని కూడా డైరెక్టర్ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మెహర్ రమేష్ కి దక్కిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని సుజిత్ కనక చేసి ఉంటే మెగాస్టార్ చిరంజీవి స్టైల్ కి అనుగుణంగా ఈ సినిమాని చేసి ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేసి ఉండేవారని ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -