Chiranjeevi: భోళా శంకర్ దెబ్బకు ఆ దర్శకునికి షాకిచ్చిన చిరంజీవి.. ఇంత మోసమేంటి బాస్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే చిరంజీవి గురించి ఇలాంటి విమర్శలు వస్తున్న తరుణంలో అభిమానులు ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే అన్ని చర్చలు కూడా పూర్తి అయ్యాయని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఆగస్టు 22వ తేదీ అధికారికంగా ప్రకటించబోతున్నారంటూ కూడా తెలుస్తుంది.

 

ఇలా ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడమే ఆలస్యం ఇలాంటి తరుణంలోనే కళ్యాణ్ కృష్ణ కు చిరంజీవి గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. భోళాశంకర్ సినిమా తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో చేయాల్సి ఉండగా ఈయన మాత్రం డైరెక్టర్ మురగదాస్ ను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తుంది.గతంలో చిరంజీవి నటించిన స్టాలిన్ ఠాగూర్ వంటి సినిమాలకు మురగదాస్ రచయితగా పనిచేయగా వివి వినాయక్ దర్శకత్వం వహించారు.

 

ఈ రెండు సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి ఇలాంటి తరుణంలో ఈయనకు భోళాశంకర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీలో మంచి సాలిడ్ హీట్ అందుకోవడం కోసం చిరంజీవి డైరెక్టర్ మురగదాస్ ను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ కూడా పెద్దగా సక్సెస్ లేక ఫ్లాప్ సినిమాలను మూటగట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో చిరంజీవి తిరిగి ఈయనకు అవకాశం ఇవ్వడం ఏంటి అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చిరుతో సినిమా చేయాలన్న కళ్యాణ్ కృష్ణ ఆశలపై చిరు భారీగానే దెబ్బ కొట్టారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -