Temple: ఈ ఆలయానికి వెళ్తే ఎలాంటి కష్టాలైనా తీరతాయట.. కలకాలం సంతోషంగా ఉంటారంటూ?

Temple: భారతదేశంలో కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత కూడా ఉంది. అటువంటి వాటిలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. నిత్యం అమ్మవారిని వందల సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం అమ్మవారు కూడా వివిధ రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారిని నమ్మి కొలిచి భక్తిశ్రద్ధలతో పూజించే వారికి కష్టాలను తొలగించి కరుణ చూపిస్తున్నారు. కాగా కాంచీపురంలో వెలసిన కామాక్షి తల్లిని దర్శించుకుంటే, మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి.

తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్లలేరట. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి, మానవ సంకల్పం చాలదు. తల్లి సంకల్పమే ప్రధానం. సమస్త భూమండలానికి నాభి స్థానం కంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మన నాభి నుండే తల్లి పోషిస్తుంది. కామాక్షి తల్లిని దర్శించుకుంటే, కష్టాలు ఉండవట. ఇక్కడ సుగంధ కుండలాంబ అవతారంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి రూపం ఉండదు. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు కూడా ఉంటాడు. అలాగే కామాక్షి ఆలయంలో అరూపా లక్ష్మీ దేవి దర్శనం ఇస్తుంది.

 

కామాక్షి తల్లిని దర్శించుకున్న తర్వాత ఆ కుంకుమ ప్రసాదాన్ని అ అరూపా క్ష్మి తల్లికి ఇచ్చి ప్రసాదంగా తీసుకుంటే భర్తని నిందించిన దోషమంతా కూడా పోతుంది. స్త్రీ, పురుషులు ఎవరైనా కూడా అరూపా లక్ష్మీ తల్లిని దర్శించుకోవచ్చు. అప్పుడు శాప విమోచనం అవుతుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వెళ్లడం వల్ల కష్టాలన్నీ తీరుతాయి. కామాక్షి దేవి ప్రధాన ఆలయానికి పక్కన ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఒక గోడ ఉంటుంది. ఆ గోడలో తుండిరా మహారాజు వుంటాడు. శివుడికి నంది ఎలాగో అలా అమ్మకి ఎదురుగా ఉంటాడు. కాత్యాయనీ దేవి శివుడిని భర్తగా పొందడానికి, కాంచీపురం క్షేత్రంలో తపస్సు చేస్తుంది. కాబట్టి ఇన్ని మహిమలు కలిగిన ఈ కామాక్షి అమ్మవారి ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే చాలు. కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -