Sunil: కమెడియన్ సునీల్ ని చెంపదెబ్బ కొట్టిన స్టార్ హీరోయిన్.. రీజన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Sunil: నువ్వు నేను సినిమాతో చిత్ర పరిశ్రమ మొత్తం తన వైపు తిప్పుకున్న కమెడియన్ సునీల్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరో తోని నటించిన ఈ స్టార్ కమెడియన్ అప్పుడప్పుడు హీరోగా చేస్తూ హిట్ లు అందుకుంటూ ఉన్నాడు. మొదట్లో అతను ఒక హీరోయిన్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడట.

ఆమె కూడా సునీల్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేదట. అయితే ఒకసారి సునీల్ వేసిన పంచ్ డైలాగ్ కి ఆమె హర్ట్ అయ్యి సునీల్ చంప పగలగొట్టిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఆమె మరెవరో కాదు నటి త్రిష. నిజానికి అందాల రాముడు సినిమాలో ముందుగా త్రిష నే హీరోయిన్ గా అనుకున్నారట. కథ మొత్తం విన్న తర్వాత హీరో ఎవరు అని అడిగిందంట త్రిష.

 

హీరో సునీల్ అని చెప్పగానే హీరోని మార్చేస్తే నేను హీరోయిన్ గా చేస్తాను అని చెప్పిందట త్రిష. అందుకు కారణం వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆనాటి సంఘటనే కారణం అని టాలీవుడ్ మొత్తం కోడై కూసింది. అప్పుడు ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా పెట్టి సునీల్ ని హీరోగా పెట్టే తీసిన అందాల రాముడు సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న చిన్న బడ్జెట్ లో వచ్చిన సినిమాలలో ప్రభంజనం సృష్టించిన సినిమాగా రికార్డులకి ఎక్కింది.

 

ఈమధ్య సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా పుష్ప లో మంగళం శీను పాత్రతో తన నట విశ్వరూపం చూపించాడు సునీల్. ప్యాన్ ఇండియా మూవీ జైలర్ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఢీకొట్టే బలమైన విలన్ క్యారెక్టర్ లో నటించి అందరి ప్రశంసలు పొందాడు సునీల్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -