Dalit Woman Stripped Urinated: మహిళను వివస్త్రను చేసి నోట్లో మూత్రం పోయించి.. ఈ మహిళకు జరిగిన అవమానం తెలిస్తే షాకవ్వల్సిందే!

Dalit Woman Stripped Urinated: దేశంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అని భయం కలుగుతుంది. అలాంటి భయంకర సంఘటన ఒకటి బీహార్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఒక దళిత మహిళపై అమానవీయంగా ప్రవర్తించాడు ఒక వ్యక్తి. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది.

పాట్నా జిల్లా ముసిఫాపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ భర్త స్థానికంగా పలుకుబడి ఉన్న ప్రమోద్ సింగ్ వద్ద కొన్ని నెలల క్రితం 1500 అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ డబ్బుని వడ్డీతో సహా చెల్లించేశారు సదరు దంపతులు. అయినప్పటికీ అదనపు వడ్డీ ఇవ్వాల్సిందేనని ప్రమోద్ సింగ్ డిమాండ్ చేశారు. అయితే ఆ దంపతులు అందుకు అంగీకరించలేదు. దీంతో దంపతులపై కోపం పెంచుకున్న ప్రమోద్ గతవారం ఆ మహిళకి ఫోన్ చేసి వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని బెదిరించాడు.

కంగారుపడిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విషయం తెలుసుకొని కోపంతో రెచ్చిపోయిన ప్రమోద్ తన అనుచరులతో గత శనివారం రాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమెని బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెపై ఆమెను వివస్త్ర ను చేసి ఆమెపై దాడి చేసి కర్రలతో కొట్టించాడు. అక్కడితో ఆగకుండా తన కుమారుడితో నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మరొకసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అప్పటికే ప్రధాన నిందితుడైన ప్రమోద్ అతని కుమారుడు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బాధిత మహిళ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. సమాజం ఎంత ముందుకి వెళుతున్నా ఆడవాళ్ళ మీద జరిగే ఆకృత్యాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఒక ఆడదాన్ని ఇంత ఘోరంగా అవమానించిన సదరు ప్రమోద్ సింగ్ కి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -