Skanda: ఫైనల్ గా “స్కంద” లో హీరోల పేర్లు తెలిసిపోయాయిగా.. ఎవరి పేరు ఏంటంటే?

Skanda: బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం స్కంద. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28న విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా కూడా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడంతో ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో రామ్ పోతినేని రెండు పాత్రలో నటించారు. శ్రీ లీల హీరోయిన్గా నటించింది. అంతా బాగానే ఉంది కానీ హీరోల పాత్రలకు, హీరోయిన్ శ్రీలీల పాత్రకు పేరు మూవీలో వెల్లడించలేదు.

దాంతో చాలామంది నెటిజెన్లు వారి పేర్లు ఏమిటా అని తెగ సెర్చ్ చేశారు. అయితే ఎట్టకేలకు వారి పేర్లు బయటకు వచ్చేసాయి. ఇంతకీ హీరో హీరోయిన్ పేరు ఏంటా అన్న విషయానికి వస్తే.. స్కంద మూవీలో హీరో రామ్ రెండు పాత్రలు చేశారు. అందులో ఒక పాత్ర కాలేజీలో చదువుకునే యువకుడిగా నటిస్తే, మరో పాత్ర మొరాకోలో పేరుగాంచిన హంతకుడు. కాలేజీ స్టూడెంట్ గా నటించిన పాత్ర పేరు భాస్కర్ రాజు. తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీలీలా రెడ్డిని ప్రేమిస్తాడు. ఇక మొరాకో నుండి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కందరాజు. రెడ్డి క్యారెక్టర్ లో హీరోయిన్ శ్రీలీల నటించింది.

ఈ మూవీ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉందట. కాగా అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతకుమించి ఉంటుంది అనే అభిమానులు ఆశపడ్డారు. అయితే ఆ అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ పరవాలేదు అనిపించేలా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -