Krishnam Raju Statue: ఆ విగ్రహం చూసి షాకైన స్టార్ హీరో ప్రభాస్.. పెదనాన్నపై ప్రేమతో అలా చేశారా?

Krishnam Raju Statue: గ్లోబల్ స్టార్ ప్రభాస్ కి ఆయన పెదనాన్న అయినా రెబల్ స్టార్ కృష్ణంరాజుకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ల బంధం అంత గొప్పగా ఉండేది. కృష్ణంరాజుకి వారసులు లేకపోవడంతో ప్రభాస్ ని తన వారసుడిగా ప్రకటించి గర్వంగా అందరికీ చెప్పుకునేవారు. అలాగే ప్రభాస్ కూడా తన పెదనాన్న ఆయన కృష్ణంరాజు గురించి, ఆయన తనకిచ్చిన సపోర్టు గురించి చాలాసార్లు స్టేజ్ మీద చెప్పడం జరిగింది.

అయితే రెబల్ స్టార్ క్రిష్ణంరాజు గారు గత ఏడాది ఈ లోకాన్ని వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకి కడసారి వీడ్కోలు పలకడం కోసం సినీలోకం మొత్తం కదలి వెళ్ళింది. అభిమానులు కూడా అదే రేంజ్ లో కృష్ణంరాజు గారి భౌతికకాయాన్ని చూడటానికి వచ్చారు. అదే రేంజ్ లో ప్రభాస్ కూడా స్వగ్రామం మొగల్తూరులో స్మారక సభను ఏర్పాటు చేసి లక్ష మందికి కడుపు నిండగా భోజనం పెట్టడం విశేషం.

ఇండస్ట్రీలో కృష్ణంరాజు, ప్రభాస్ ల కుటుంబానికి అతిది మర్యాదలతో చంపేస్తారని పేరు ఉండనే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే కృష్ణంరాజు గారు చనిపోయి ఏడాది గడిచిపోయింది. హైదరాబాదులో సంవత్సరికం కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా పూర్తి అయిపోయాయి. అయితే ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణంరాజు విగ్రహం గురించి ఆయన భార్య ఒక ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు.

పిఠాపురానికి చెందిన అభిమాని ఈ విగ్రహాన్ని అందించారని, దీంతో ఆయన మా పక్కనే ఉన్నారన్న ఆనందంతో గడుపుతున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఈ విగ్రహాన్ని చూసిన ప్రభాస్ ఒక్కసారి గా ఉలిక్కిపడ్డాడని చెప్పారు. ఒక్క నిమిషం విగ్రహం వైపే చూస్తూ ఏమి మాట్లాడలేకపోయాడు, తర్వాత తేరుకొని విగ్రహాన్ని ఎవరు చేశారు అని అడిగి తెలుసుకున్నారు. జీవకళ ఉట్టిపడుతున్నట్లు ఉందని మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు శ్యామలాదేవి. ఇక ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సాలార్ 22న విడుదలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -