Akhil: అందంగా కనిపించడానికి ఆ ఆపరేషన్ చేయించుకుంటున్న అఖిల్.. పరువు పోతుందిగా

Akhil:  ఈమధ్య సోషల్ మీడియాలో అక్కినేని కుటుంబం గురించి ఎక్కడా లేని ట్రోల్స్ అన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కినేని హీరోలయిన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురి సినిమాలు బాక్స్ ఆఫీస్ లో డిజాస్టర్ గానే మిగులుతున్నాయి. ఆ కుటుంబం నుంచి ఒక్క సరైన హిట్టు కూడా పడకపోవడంతో నెటిజన్స్ అందరూ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కినేని ఇంటి నుంచి ఒక వార్త హల్చల్ చేస్తుంది.

అదేంటంటే అక్కినేని అఖిల్ తన నోస్ సర్జరీ చేయించే ప్రయత్నంలో ఉన్నాడట. ప్రస్తుతానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత ఏజెంట్ సినిమాతో పెద్ద డిజాస్టర్లో ఉన్న అక్కినేని అఖిల్ కి తన ఫేస్ లో ఉన్న ఆ నోస్ షేప్ అట్రాక్షన్ ని పాడు చేస్తుందని అభిప్రాయపడుతున్నాడట. అందుకే నోస్ సర్జరీ చేస్తే తనకి మంచి అవకాశాలు వస్తాయి ఫేస్ అట్రాక్టివ్ గా ఉంటదని సర్జరీకి సిద్ధమవుతున్నాడు.

దీనిమీద నెటిజన్లు ట్రోల్ చేస్తూ, అందంగా ఉండాలని హీరోయిన్లు ఫేస్ సర్జరీలు చేసుకోవడమే కానీ హీరోలు సర్జరీ చేసుకోవడం అనేది చాలా అరుదు. అలాంటిది ఆ సర్జరీ కనుక ఫ్లాప్ అయితే అక్కినేని కుటుంబ పరువు గోవిందా అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు అందాన్ని పెంచుకుందామని సర్జరీలు చేయించి, ఉన్న అందాన్ని కూడా చెడగొట్టుకున్న సందర్భాలు చాలా చూసాము.

అటువైపు నాగచైతన్య కి విడాకులు తర్వాత వరుస ఫ్లాప్ లని ట్రోల్స్ చేస్తుంటే, ఇటువైపు అఖిల్ కి తనకేరియర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్ప ఇంకొక హిట్టు కూడా లేదు అని ట్రోల్స్ చేస్తున్నారు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఉన్న ఆ గ్రాఫ్, ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత మారుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ మారితే మాత్రం అఖిల్ రేంజ్ ఇంక ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి ఈ ప్రయత్నం ఏమవుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -