Kajal-Sreeleela: శ్రీలీల క్యారెక్టర్ అలాంటిది.. కాజల్ అగర్వాల్ కామెంట్లు వింటి మాత్రం షాకవ్వాల్సిందే!

Kajal-Sreeleela: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా కాజల్, శ్రీ లీలలు కథానాయకులుగా నటించారు. ఈ సినిమాలో కాజల్ కాత్యాయనిగా అలరించనున్నారు. అక్టోబర్ 19న సినిమా విడుదల కాబోతుంది. అయితే విడుదల తేదీ దగ్గరగా రావడంతో సినిమా టీం వాళ్ళందరూ ప్రమోషన్ ని జోరుగా చేస్తున్నారు.

మొన్నే ట్రైలర్ ని విడుదల చేస్తూ ఒక ఆడియో లాంచ్ ఫంక్షన్ కూడా పెట్టారు. అందులో తారలు శ్రీ లీల, కాజల్ లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అందులోనే కాకుండా వివిధ ఛానల్లో చాలా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు చిత్ర బృందం. ఇలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి చెప్పమని కాజల్ ని అడగగా కాజల్ ఈ విధంగా చెప్పింది. “నేను సినిమాని అమితంగా ప్రేమిస్తాను. నా వ్యక్తిగతంతో చాలా మటుకు సినిమాలు రిలేట్ అవుతాయి.

నాకు ఒకసారి ఆ సినిమా కనెక్ట్ అయితే నేను దానికోసం ప్రాణం పెడతాను. కష్టపడితే ఏ పనినైనా సులువుగా చేయొచ్చు అలాంటి కష్టం, అలాంటి సినిమా మీద ఇష్టం నేను శ్రీ లీలలో చూశాను. తను ఏదైనా కష్టపడి నేర్చుకుంటుంది, ఇష్టంగా చేస్తుంది. అలాగే సెట్లో అందరితోనూ చాలా చనువుగా ఉంటుంది. మా ఇద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. సినిమాలో తను చాలా మంచి పాత్రను పోషిస్తుంది.

అలాగే తనకి కెరీర్ మీద ఒక ఫోకస్ ఉంది.ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. ఈ తరంలో హీరోయిన్లకి కావాల్సిన గుణాలన్నీ శ్రీ లీలలో ఉన్నాయి. అందరితోని చలాకీగా ఉంటుంది” అని పేర్కొన్నారు కాజల్. ఇదిలా ఉండగా చాలా సంవత్సరాల తర్వాత కాజల్ మళ్ళీ తెలుగులో కంబాక్ ఇవ్వబోతున్న సినిమా ఇది. బాలకృష్ణ సరసన కాజల్ అలరించి తిరిగి ప్రేక్షకుల మనసులని దోచుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -