’10 films for ₹699′: రూ.699కే పీవీఆర్ లో 10 సినిమాలు.. మూవీ లవర్స్ కు ఇది బంపర్ ఆఫర్ అంటూ?

’10 films for ₹699′: ఐనాక్స్ లోకి వెళ్లి సినిమా చూడాలంటే అదెంత కష్టమో అందరికీ తెలిసిందే. దానికోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. అయితే పివిఆర్ సినిమా కొత్తగా ఒక ఆఫర్ ని పెట్టింది. మనం ఓటీటీ లో నెరవారి ఇంత డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకుంటామో దీనికి కూడా అలాగేనట 699 కడితే పది సినిమాలు చూడొచ్చట. ఆఫర్ బాగుంది కదా సినిమా లవర్స్ కి అయితే నచ్చుతుంది.కానీ లోతుగా వెళ్తేనే దీనికున్న సమస్యలు ఏంటో తెలుస్తాయి.

699 బానే ఉన్నాయి కానీ మొదటి సమస్య ఏంటంటే ఈ పది సినిమాలు 30 రోజులు కాలంలోనే చూడాలట. అది ఎలా సాధ్యమవుతుంది ప్రతి వారం అరడజను సినిమాలు విడుదలవుతాయి కానీ అన్ని మంచిగా ఉండవు. చాలా ఫ్లాప్ సినిమాలు కంటెంట్ లేని సినిమాలు చిరాకు వచ్చే సినిమాలు కూడా ఉంటాయి.పోనీ మంచి సినిమాలు విడుదలవుతాయా అంటే ఏదో మూడు నెలలకి ఒక మంచి సినిమా విడుదలవుతుంది.

సబ్స్క్రిప్షన్ ఉంది కదా అని చెప్పి ధియేటర్ కి వెళ్తే ఆ చెత్త సినిమాలు చూసి తలనొప్పి పెరుగుతుంది. ఇంకొక సమస్య ఏంటంటే ఈ ఆఫర్ కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఉంటుందట. అంటే వీకెండ్స్ ఉండదు ఆఫీసులో పనిచేసే వాళ్లు సెలవు పెట్టుకొని సినిమాకు రావాలి లేకపోతే సెకండ్ షో కి వెళ్ళాలి. సెకండ్ షో కి వెళ్తే నిద్ర త్యాగం చేసి దాని తర్వాత రోజు మళ్ళీ ఆఫీస్ కి బయలుదేరాలి.

పోని సినిమా పిచ్చోళ్ళు నిద్ర త్యాగం చేశారు అనుకుంటే ఐనాక్స్ లోకి వెళ్లి బ్రేక్ టైం లో బయటికి రావాలంటే జేబులో పెద్ద కన్నం పడిపోతుంది. వాటర్ బాటిల్ కూడా కొనలేని రేట్లు అక్కడ కనిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్య అన్ని సినిమాలు చూడడం కన్నా హాయిగా ఓటీటీలో అదే డబ్బులతో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చూడొచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -