Nara Lokesh: ఏపీలో లోనే మూడు ప్యాలస్ లు నిర్మించుకునేంత పేదవాడు జగన్.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Lokesh: భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అంటే అందరి చూపు, అందరి వేళ్ళు ఏపీ వైపే ఉంటాయి. అది జగన్ మోహన్ రెడ్డి పేరే చెపుతాయి. ఇవి విపక్ష పార్టీ నేతలో, జగన్ అంటే గిట్టని వారో చెపుతున్న మాటలు కావు. ఈ ఇంటర్నెట్ జమానాలో దేనికైనా సమాధానం చెప్పగలిగేది. జగన్ ఆస్తుల చిట్టా ఇంటర్నెట్ సాక్షిగా ఇంటర్ నేషనల్ పత్రికలలో కూడా ప్రచురించబడింది. అయితే జగన్ మాత్రం ఇందుకు విరుద్ధమైన ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రతిపక్ష పార్టీలను, ఆయా పార్టీ నేతలను ప్రజలకు దూరం చేయడానికి రానున్న ఎన్నికలు పేదలకు -పెత్తందారులకు మధ్య జరిగే కురుక్షేత్రం అంటూ తన ముందున్న స్క్రిప్ట్ పేపర్ చదువుతూ ఉంటారు.

ఇందులో పేదలేవరనేది ఇప్పటికి అర్ధం కానీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే దీనికి సమాధానం పవన్ తన వారాహి యాత్రలో కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విపులంగా లెక్కలతో ఈ పేదవాడి కాన్సెప్ట్ ను ప్రజలకు వివరించారు. అవును జగన్ పేదవాడే ఎంత పేదవాడంటే హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలస్, బెంగళూర్ లో ఒక ప్యాలస్, పులివెందుల లో ఒక ప్యాలస్, తాడేపల్లిలో ఒక ప్యాలస్, తాజాగా విశాఖ రుషికొండ మీద మరో ప్యాలస్ కట్టుకునేంత పేదవాడు మన సీఎం జగన్ అంటూ జగన్ ప్యాలస్ ల లిస్ట్ లోకేష్ ప్రజల ముందుంచారు.

ఒక్క ఏపీలో లోనే మూడు ప్యాలస్ లు నిర్మించుకునేంత పేదవాడు ఈ జగన్. రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నాడు కనీసం ఒక రాజధాని కూడా నిర్మించలేకపోయాడు. కానీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో తన ప్యాలస్ ల నిర్మాణం మాత్రం పూర్తి చేయించుకున్న జగన్ నిజంగా పేదవాడేనేమో. ఉచిత పథకాల పంపిణీలతో రాష్ట్రాన్ని పేదిరికంలోకి నెట్టి, రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఓట్ల రాజకీయాలు చేస్తూ ప్రజల పై, ప్రతిపక్షాల పై పెత్తనం చేస్తున్న ఈ జగన్ పెత్తందారుడు కాదా? దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి దాదాపుగా 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచి, పేదల పై సుమారుగా 11 వేలకోట్ల భారం మోపిన దోపిడీదారు ఈ జగన్ అంటూ లోకేష్ వైసీపీ పై విరుచుకుపడ్డాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -