Samantha: లేడీ బ్రూస్ లీలా కనిపిస్తోన్న సమంత.. ఆ అందం మామూలు అందం కాదంటూ?

మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని తర్వాత శాకుంతలం, ,యశోద, విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలు చేసింది. యశోద సో సో అనిపించుకుంది, శాకుంతలం పెద్ద డిజార్డర్ అయితే విజయ్ దేవరకొండ ఖుషి మాత్రం అబౌ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సమంత కొంతకాలం సినిమాలకి విరామం ప్రకటించి విదేశాలకి విహారయాత్రకి వెళ్ళింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ తెగ బిజీగా ఉంది.

తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో విహరిస్తుంది.తన అనారోగ్యం నుంచి బయటపడేందుకు, తను మానసికంగా మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. జిమ్ లో శ్రమిస్తూ తన ఫిట్నెస్ ని కూడా పెంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాలు కి కమిట్మెంట్స్ తీసుకోలేదు.

ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమాలు వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న ఈ భామ తెగ వర్క్ అవుట్ లో చేస్తూ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈమధ్య ఇన్స్టాగ్రామ్ లో జిమ్ లో వర్క్ అవుట్ చేసిన ఒక పిక్ ని షేర్ చేసింది సమంత. ఇందులో ఆమె చూడటానికి పర్ఫెక్ట్ బాడీ షేప్ తో అచ్చం లేడీ బ్రూస్లీ లా కనిపించింది అంటున్నారు నెటిజన్స్.

సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్న ఈ భామ అందులో యాక్షన్ సీక్వెన్స్ కోసం తన బాడీ లుక్కు కూడా మొత్తం మార్చుకుంటుంది. అందుకే జిమ్ములో బరువులు ఎత్తుతూ కండలు పెంచుతుంది. టోపీ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్న సమంత జిమ్ లుక్ కుర్రాళ్ళ మనసు కొల్లగొడుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -