Murari Movie: మహేష్ బాబు మురారి సినిమాకు సీక్వెల్.. ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరంటే?

Murari Movie: అప్పట్లో వచ్చిన మురారి సినిమా మహేష్ బాబు మూవీ జర్నీకి కొత్త టర్నింగ్ అని చెప్పాలి. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి మరొక పెద్ద హైలైట్. తరాలు మారినా, ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ సినిమా. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్లన్లు రాబట్టి రికార్డు సృష్టించింది.

అయితే ఈ సినిమా కి సీక్వెల్ వస్తుందంటూ ఇన్నాళ్లు ఎన్నో రోమర్స్ వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు ఆ రూమర్ ని నిజం చేస్తూ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. నిజంగానే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. మహేష్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ, సోనాలి బింద్రే పాత్రలో శ్రీ లీల నటిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.

కానీ వస్తుంది అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఇదే కాంబినేషన్ తో కనుక వస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని సమాచారం. అయితే కొన్నాళ్ల క్రితం మురారి సినిమాకి సీక్వెల్ వస్తుందని ఇందులో హీరోగా మహేష్ బాబు మేనల్లుడు గళ్లా అశోక్ హీరోగా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

మహేష్ బాబు సినిమా కాబట్టి అతని మేనల్లుడు ఈ సినిమా తీయటంలో పెద్దగా వింత లేదని, ఘట్టమనేని వారసుడు కాబట్టి వారి మద్దతు కూడా ఉంటుందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. గల్లా మహేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు చిత్రాల్లో ఏ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉంది అని అడగగా మురారి అయితే తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. అయితే ఎందుకో ఆ మూవీ పట్టాలెక్కలేదు. మరి ఈ మూవీ పట్టాలెక్కుతుందో లేకపోతే ఆ సినిమా లాగా రూమర్ లా మిగిలిపోతుందో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -