Sreeleela: శ్రీలీల లక్ ని డిసైడ్ చేసే సినిమాల లెక్క ఇదే.. ఈ సినిమాలు శ్రీలీల భవిష్యత్తును మార్చుతాయా?

Sreeleela: శ్రీలీల పేరు తప్ప ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక హీరోయిన్ పేరు వినిపించడం లేదు. అంతగా అందరి సినిమాలలో నటిస్తూ, అందరి డైరెక్టర్ల దృష్టిలోనూ శ్రీలీలే కనిపిస్తుంది. మొదట కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి సందడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తంలో టాలీవుడ్ లో అడుగు పెట్టిందో గాని పాప ఫుల్ బిజీ అయిపోయింది. పెళ్లి సందడి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆమె నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత రవితేజతో ధమాకాలో అవకాశాన్ని దక్కించుకుంది శ్రీ లీల. ఆ సినిమా హిట్తో ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఆశించిన స్థాయిలో స్పీడ్ మాత్రం కనిపించడం లేదు అంటున్నారు విమర్శకులు. ఈ సంవత్సరం విడుదలైన స్కంద మూవీ రిజల్ట్స్ మనందరికీ తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజార్డర్ ని సొంతం చేసుకుంది. దీంతో శ్రీల ఖాతాలో మరొక ఫ్లాప్ వచ్చి పడింది.

తాజాగా భగవంత్ కేసరి సినిమాలో కీలక రోల్ రోల్ పోషించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఆమె నటనకు కూడా మంచి మార్పులే పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత తను వైష్ణవి తేజ్ కి జోడిగా నటించిన ఆది కేశవ సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాపై పెద్దగా ప్రేక్షకులకి బజ్ ఏర్పడలేదు . ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే జనాల్లోకి పెద్దగా వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు.

తర్వాత నితిన్ కి జోడిగా చేస్తున్న ఒక సినిమా డిసెంబర్ లో రిలీజ్ కావలసి ఉంది. తర్వాత వచ్చే ఏడాది మహేష్ బాబు కి జోడిగా గుంటూరు కారం రిలీజ్ కానుంది, పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు తన ఆశలు అన్ని రాబోయే నితిన్ ఎక్స్ట్రార్డినరీ మూవీ, ఆది కేశవ మీద ఉన్నాయి. ఈ రెండు సినిమాలే శ్రీలీల భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -