Bengaluru: తల్లీ,కుమార్తె ఆత్మహత్యకు కారణం పెంపుడు కుక్కట..అసలు కారణం ఇదే!

చిన్న చిన్న కారణాలతో మనస్తాపం చెంది కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తన మాట నెగ్గాలంటే తన మటంటూ పంథాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెంపుడు కుక్కలను ఇతరులకు ఇవ్వాలని కోరగా అందుకు అత్తంటి వారు ఒప్పుకోకపోవడంతో ఓ మహిళ తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరులో దివ్య (36) గృహిణి ఆమె కుమార్తె హ్రూద్య (13) ఒక ప్రైవేట్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. దివ్యకు కుక్కలంటే ఎలర్జీ, ఆమె కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతుండటంతో వైద్యులను సంప్రదించింది. అయితే దివ్య అనారోగ్యానికి కారణంగా కుక్కలేనని, వాటికి దూరంగా ఉండాలని డాక్టర్లు సంధ్యకు సూచించారు.

వారింట్లో ఉన్న పెంపుడు కుక్కను వేరే వాళ్లకు ఇవ్వాలని ఆ మహిళ తన భర్త, అత్తమామలను కోరగా వారు కుక్కను ఇవ్వడానికి నిరాకరించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమె అత్తింటి వాళ్లు వేరే వాళ్లకు కుక్కను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన సంధ్య కుమార్తె హ్రుద్య (13)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్త, ఆమె అత్తపై కేసు నమోదు చేశారు.

భర్త, అత్తవారింటిపై దివ్య తండ్రి రామన్‌ ఎంకే ఫిర్యాదు చేశారు. దివ్య, శ్రీనివాస్‌ 2008లో వివాహం చేసుకున్నారని పెంపుడు కుక్కను ఇంట్లో ఉంచితే తాను, తన బిడ్డ ఆత్మహత్య చేసుకుంటామని తన కూతురు చెప్పిందని, ఆమె చనిపోతే ఏమీ జరగదని, తమ పెంపుడు జంతువులు కాపాడుకుంటామని భర్త, అత్తమామలు దురుసుగా స్పందించారని దివ్య తండ్రి రామన్‌ తన ఫిర్యాదులో తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -