Gujarat: ఈ కానిస్టేబుల్ మంచి మనస్సుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏమైందంటే?

Gujarat: రీసెంట్ గా ఒక కానిస్టేబుల్ తన తల్లి మనసుని చాటుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఇదంతా గుజరాత్ హైకోర్టు ప్యూన్ ఉద్యోగాలకు జరిగిన పరీక్షల్లో ఆరు నెలల శిశువును కన్నతల్లి పరీక్ష రాస్తుండగా ఒక కానిస్టేబుల్ ఆ శిశువుని ఎత్తుకొని తన లాలన పాలనా చూస్తూ తనని ఆడిస్తుంది.

ఈ సంఘటన అహ్మదాబాద్ పరీక్షా స్థలం దగ్గర చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్థానికులు చూసి ఆ లేడీ కానిస్టేబుల్ ని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం తెగ హల్ చల్ చేస్తుంది. ఈ సంఘటన జులై 9న(ఆదివారం) చోటు చేసుకుంది. సరిగ్గా పరీక్ష రాసే సమయానికి శిశువు ఏడుపు మొదలు పెట్టింది. అదే సమయంలో ఏం చేయాలో నీ తల్లి కంగారు పడుతూ ఉంది. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ డయాబెటి విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్లింది. ఆ బిడ్డను ఎత్తుకొని లాలించింది.

 

“మీరు వెళ్లి ధైర్యంగా పరీక్ష రాసి రండి. అంతవరకు మీ బిడ్డని చూసుకొనే బాధ్యత నాది” అని ధైర్యం చెప్పింది. తల్లిని పరీక్ష హాల్ లోకి పంపింది. ఆ పాపని ఎత్తుకొని లాలిస్తూ ఉండగా గుజరాత్ పోలీసులు ఈ సంఘటనని వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఆ లేడీ కానిస్టేబుల్ విధులు నిర్వహించడమే కాకుండా చిన్న పిల్లని లాలించే పని కూడా చేయడం గర్వకారణంగా ఉంది.

 

గుజరాత్ పోలీసులు ఈ పోస్ట్ ని పెట్టగా దానికి లక్షల్లో వ్యూస్ ,వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. చాలామంది ఆమె మంచి మనసును అభినందిస్తూ ఉండగా మరికొన్ని మంది ఇలాంటి మంచి మనసు ఉన్నవారు దేశానికి ఈ రంగంలో చాలా అవసరం అని చెప్తూ వాళ్లకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఆమెకి హాట్సాఫ్ చెప్తున్నారు. ఈ న్యూస్ ని వైరల్ చేస్తూ మరింత మందికి తెలియజేసేలాగా చేస్తున్నారు

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -