Kavitha: దేశానికి తెలంగాణ దిక్సూచి.. ఆక్స్ ఫర్డ్ లో కవిత ప్రసంగానికి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

Kavitha:  ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి ఒక దిక్సూచి లాంటిది అంటూ ఈమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు.

పరిపాలనలో సీఎం కేసీఆర్ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కెసిఆర్ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ఈమె తెలియజేశారు.

ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని… అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు.

రికార్డుస్థాయిలో మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందనీ ఈ సందర్భంగా కెసిఆర్ పరిపాలన గురించి గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత చేసినటువంటి ప్రసంగం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -